Begin typing your search above and press return to search.
లాల్ చడ్డాకు మరో భారీ ఎదురుదెబ్బ.. కొనేందుకు వణుకుతున్నారట
By: Tupaki Desk | 23 Aug 2022 4:36 AM GMTసింఫుల్ గా తీసుకునే కొన్ని అంశాలు సీరియస్ గా మారటమే కాదు.. దిమ్మ తిరిగిపోయేలా షాకులు ఇచ్చే విషయం తెలిసిందే. తాజాగా అలాంటిదే ఒకటి బాలీవుడ్ లో ఎదురైంది. మిస్టర్ పర్ ఫెక్టుగా పేరున్న అమీర్ ఖాన్ కు బాయ్ కాట్ బ్యాచ్ తో ఎదురైన చేదు అనుభవం కొనసా..గుతోంది. సినిమా వసూళ్లు దారుణంగా ఉండటమేకాదు.. సినిమా రిలీజ్ అయిన వారంలోనే చాలా థియేటర్లలో మూవీని ఎత్తేయటం తెలిసిందే.
బాయ్ కాట్ ను పెద్ద ఇష్యూగా తీసుకోని టీం అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. అమీర్ ఖాన్.. కరీనా జంటగా నటించిన ఈ మూవీలో నాగచైతన్య కూడా నటించారు. దాదాపు నాలుగేళ్ల పాటు శ్రమించి రూపొందించిన ఈ మూవీకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.
ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ మూవీ దారుణమైన డిజాస్టర్ జాబితాలో చేరింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి కోలుకోలేని మరో ఎదురుదెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది.
ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం చేసుకుంది.సినిమా విడుదలైన మూడు నెలలకు ఓటీటీలో విడుదల చేసుకునేందుకు వీలుగా నెట్ ఫ్లిక్స్ తో భారీ ఒప్పందం చేసుకున్నారు. ఈ డీల్ విలువ ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.
ఓవైపు ట్రోలింగ్.. మరోవైపు బాయ్ కాట్ వెరసి దారుణ పరాజయం పొందిన ఈ మూవీని ఓటీటీ కోసం ఒప్పందం చేసుకున్న నెట్ ప్లిక్స్ వెనక్కి తగ్గటమేకాదు.. తాజాగా డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
నెట్ ఫ్లిక్స్ ఎప్పుడైతే ఈ డీల్ నుంచి పక్కకు తప్పుకుందో.. మిగిలిన ఓటీటీ సంస్థలు లాల్ సింగ్ చడ్డా వైపు చూసేందుకు సైతం వెనుకాడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే భారీ నష్టాల్ని ఎదుర్కొంటున్న లాల్ సింగ్ కు తాజా పరిణామం కోలుకోలేని దెబ్బగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూవీని ఓటీటీలో కొనేందుకుఏ సంస్థ ముందుకు వచ్చే ప్రయత్నం చేయదని.. అమీర్ కెరీర్ నే ప్రశ్నార్థకంగా మార్చిన బాయ్ కాట్ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త ఆందోళనకు గురి చేస్తుందని చెబుతున్నారు.