Begin typing your search above and press return to search.
'లాల్ సింగ్ చడ్డా' ముందే జాగ్రత్త పడ్డారా?
By: Tupaki Desk | 4 Aug 2022 2:30 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11వ తారీకు విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది. మొన్నటి వరకు పెండ్డింగ్ లో ఉన్న సెన్సార్ కార్యక్రమాలను కూడా యూనిట్ సభ్యులు పూర్తి చేశారు. సినిమా ను సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ల్లో కూడా విడుదల చేయడం ద్వారా ఎక్కువ వసూళ్ల పై ఆమీర్ దృష్టి పెట్టాడు.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డ్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ ను ఇవ్వడం జరిగింది. ఈ సినిమా కథ మరియు స్టార్ కాస్టింగ్ నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఇటుగా మూడు గంటల వరకు ఉంటుందని బాలీవుడ్ మీడియా విశ్లేషించింది.
కానీ లాల్ సింగ్ చడ్డా సినిమా ఫైనల్ ఔట్ పుట్ ను 2 గంటల 44 నిమిషాలు గా నిర్థారించడం జరిగింది. మూడు గంటలకు 16 నిమిషాలు తక్కువ. సౌత్ రెగ్యులర్ సినిమాలతో పోల్చితే కాస్త నిడివి కాస్త ఎక్కువే అన్నట్లుగా ఉన్నా కూడా ఇటీవల విడుదల అయిన కేజీఎఫ్.. ఆర్ ఆర్ ఆర్.. అంతకు ముందు వచ్చిన బాహుబలి సినిమాలతో పోల్చితే మాత్రం తక్కువే అని చెప్పాలి.
ఈమధ్య కాలంలో సినిమాల యొక్క నిడివి అనేది సినిమా ఫలితాన్ని మార్చేస్తుంది. అందుకే నిడివి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అందుకే అనవసరం అనుకున్న స్టఫ్ ను తొలగించేసి మూడు గంటల లోపుకు ఈ సినిమాను తీసుకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ముందే జాగ్రత్త పడి లాల్ సింగ్ చడ్డా నిడివి తగ్గించి ఉంటారని బాలీవుడ్ వర్గాల టాక్.
ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో చాలా విభిన్నమైన గెటప్ లో కనిపించడంతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంది.
ఇక నాగ చైతన్య మరియు విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా లాల్ సింగ్ చడ్డా పై అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగు లో చిరంజీవి సమర్పించబోతున్నాడు. అందుకు కూడా సినిమాపై అంచనాలు పెరిగాయి.