Begin typing your search above and press return to search.
గత 13 ఏళ్లలో అగ్ర హీరోల చెత్త రికార్డు ఇదే
By: Tupaki Desk | 12 Aug 2022 4:28 AM GMTప్రతి వారం లానే ఈ శుక్రవారం కూడా రెండు భారీ సినిమాలు దేశవ్యాప్తంగా విడుదలయ్యాయి. ఇందులో ఒక పాన్ ఇండియా సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. కానీ ఈ రెండిటి ఓపెనింగుల ఫలితం ఎలా ఉంది? అని ప్రశ్నిస్తే.. సింపుల్ గా 'పూర్'(చెత్త) అని తేల్చేసాయి ట్రేడ్ వర్గాలు.
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా మొదటి రోజు కేవలం 12 కోట్ల లోపు వసూలు చేయగా .. ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన ఫ్యామిలీ డ్రామా 'రక్షాబంధన్' 9 కోట్ల లోపు మాత్రమే వసూలు చేసిందని రిపోర్ట్ అందింది. నిజానికి ఈ వసూళ్లు తెలుగులో మిడ్ రేంజ్ హీరోలు సాధించేవి. ఇవి స్టార్ హీరో రేంజ్ ఓపెనింగులు అయితే కావని పెదవి విరిచేస్తున్నారు.
దాదాపు నాలుగు సంవత్సరాల విరామం తర్వాత అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' అభిమానుల ముందుకు వచ్చాడు. తొలి అంచనాల ప్రకారం అద్వైత్ చందన్ సినిమా రూ. రూ. 11.00 నుండి 12.50 కోట్లు లోపు ఓపెనింగులు తెస్తోందని సమాచారం. జాతీయ మల్టీప్లెక్స్ చైన్ లు సేవింగ్ గ్రేస్ గా ఉండటంతో సినిమా చాలా పేలవమైన ప్రదర్శన తో నిరాశపరిచిందని సమాచారం. గత 13 ఏళ్లలో అమీర్‌ఖాన్‌కి అతి తక్కువ ఓపెనింగ్ రావడం ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది
కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన 83 - ఫర్హాద్ సామ్జీ చిత్రం బచ్చన్ పాండే కంటే ఓపెనింగ్ అధ్వాన్నంగా ఉంది. ఇది ప్రారంభ రోజు పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. మాస్ బెల్ట్ లలో కానీ మెట్రోల్లో కానీ సరిగా ఆడే పరిస్థితి లేదని కూడా ట్రేడ్ అనలైజ్ చేస్తోంది. లాల్ సింగ్ కి వ్యతిరేక సమీక్షలు కూడా పెద్ద మైనస్ గా మారాయి. లాల్ సింగ్ చద్దా చిత్రం ఓపెనింగులు హిందీ చలనచిత్ర పరిశ్రమ అంతటా షాక్ వేవ్స్ క్రియేట్ చేసాయని ప్రముఖ క్రిటిక్ విశ్లేషించారంటే అర్థం చేసుకోవాలి. ఇది బాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ పునరాలోచనలో పడేలా చేసింది. అమీర్ ఖాన్ సినిమా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా రూ. 15 కోట్లు వసూలు చేయగలిగాడు. కానీ ఈసారి ఓపెనింగులు అలా లేవని విశ్లేషిస్తున్నారు.
లాల్ సింగ్ చద్దా ట్రైలర్ కు తీవ్ర విమర్శలొచ్చాయి. దానివల్ల పేలవమైన మార్కెటింగ్ ప్రచారం జరిగింది. ఇది ప్రీ-రిలీజ్ బజ్ వైఫల్యానికి దారితీసింది. అందువల్ల చాలా పేలవంగా మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రారంభమైంది. అయితే వారం పాటు సెలవు దినాలు లాల్ సింగ్ చద్దాకు కొంత కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఓపెనింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద రేంజులో విజయం సాధించాలనే కలలకు ముగింపు పలికింది.
ఖిలాడీ ఇంకా నీరసంగా..!
అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' అయినా ఓపెనింగ్ డే 20కోట్లు రేంజులో వసూలు చేస్తుందని అంచనా వేసారు. కానీ ఇది కనీసం 8కోట్లు అయినా వసూలు చేయలేదని ట్రేడ్ చెబుతోంది. భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కూడా నిరాశాజనకంగా ప్రారంభమైంది. తొలి అంచనాల ప్రకారం ఈ సినిమా రూ. రూ. 7.50 నుండి 8.50 కోట్లు మాత్రమే ఓపెనింగులు తేగలదు. ఇది హిందీ చిత్ర పరిశ్రమ సాంప్రదాయిక అంచనాల కంటే చాలా తక్కువ. రక్షా బంధన్ బాక్స్ ఆఫీస్ అంచనా ప్రకారం.. 1వ రోజు అక్షయ్ కుమార్ నటించిన డిజాస్టర్ చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ కంటే తక్కువ రేంజులో ప్రారంభమైంది. 8 కోట్లు సుమారు వసూళ్లు దక్కాయని ట్రేడ్ చెబుతోంది.
మాస్ సెంటర్ లు సహా ఉత్తరాది అంతటా రక్షాబంధన్ ప్రారంభం పేలవంగా ఉంది. అయితే మధ్యాహ్నం షోల తర్వాత ఆక్యుపెన్సీ కొంత మెరుగ్గా ఉందని సమాచారం. గుజరాత్ వంటి కొన్ని మాస్ సెంటర్లలో ఇది లాల్ సింగ్ చద్దా కంటే మెరుగ్గా ఉంది. కానీ భారతదేశంలోని అన్ని ఇతర ప్రదేశాలలో ఈ చిత్రం అమీర్ ఖాన్ నటించిన చిత్రం కంటే వెనుకబడి ఉంది.
పేలవమైన ప్రారంభం కారణంగా రాబోవు కొన్ని వారాల పాటు స్థిరంగా వసూళ్లను కొనసాగించేందుకు టీమ్ కృషి చేయాల్సి ఉంది. వారం పాటు సెలవులు రక్షా బంధన్ కి కొంత ఊరట. చెత్త సినిమా అని టాక్ వచ్చినా కానీ అక్షయ్ కుమార్ చిత్రం రెండంకెల ఓపెనింగ్ ను సాధించాలి.. కానీ అది జరగలేదు. ఈ రిజల్ట్ పరిశీలించాక... ఉత్తరాది ప్రేక్షకులు తమ సందేశాన్ని సూటిగా నే ఇచ్చేశారని విశ్లేషిస్తున్నారు. ఈ సన్నివేశం నిజంగా స్టార్ హీరోలు ఊహించనిది.