Begin typing your search above and press return to search.
లాల్ సింగ్ చడ్డా తెలుగు ట్రైలర్
By: Tupaki Desk | 25 July 2022 4:16 AM GMTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఒక కథను ఎంపిక చేసుకున్నారు అంటే దానికి యూనివర్శల్ అప్పీల్ ఉంటుంది. ఇప్పుడు అతడు నటించిన `లాల్ సింగ్ చడ్డా` ఈ కేటగిరీనే. తాజాగా రిలీజైన తెలుగు ట్రైలర్ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ఒక మనిషి జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ అయినా జరిగేందుకు ఆస్కారం లేకపోలేదు! అన్న సన్నని థిన్ లైన్ తో అద్భుతమైన విజువల్స్ తో ఈ మూవీని తెరకెక్కించారని అర్థమవుతోంది.
తాజా ట్రైలర్ లో అమీర్ పాత్ర తీరుతెన్నులు ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. అసలు నడవగలడో లేదో తెలియని ఒక అమాయకుడైన బాలకుడు నడుస్తాడు.. పరిగెడుతాడు.. రేసులకు వెళతాడు.. చివరికి ఆర్మీలో యుద్ధ వీరుడిగా కనిపిస్తాడు.. ఇదంతా ఒక మిరాకిల్ అని అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటేనే. ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏది ఎలా మారుతుందో ముందే చెప్పలేం అనే థీమ్ ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.
అమ్మ చెబుతుండేది తలరాత ముందే రాసి ఉంటుందని..! ఎవరు రాసోరో ఎంత రాసారో అసలు ఎందుకు రాసారో ఇవన్నీ? అంటూ అమీర్ చెప్పే డైలాగ్ ఎంతో ఆలోచింపజేస్తుంది. నిజానికి ముందే రాసిన రాత ప్రకారమే మనిషి ప్రయాణం సాగుతుందన్న తాత్వికతను ఈ ట్రైలర్ లో భోధించారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్ కి ఇది అధికారిక రీమేక్. భారతదేశంలోని అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అమీర్ సన్నాహకాల్లో ఉన్నారు.
`లాల్ సింగ్ చడ్డా` హిందీ-తెలుగు-తమిళంలోనూ అత్యంత భారీగా విడుదలవుతోంది. ఈ చిత్రంతోనే తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య హిందీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు. చైతన్య ఇందులో అమీర్ తో పాటు పని చేసే ఆర్మీ మేన్ గా కనిపిస్తుండగా.. కరీనా కపూర్ ఖాన్ .. అమీర్ సరసన కథానాయికగా నటించింది.
ట్రైలర్ లో కరీనాతో ఖాన్ చిన్నప్పటి స్నేహం ఎంతో క్యూట్ గా అనిపిస్తుంది. అది ఎదిగే క్రమంలో ప్రేమగా మారడం .. పెళ్లి విషయానికి వస్తే మన దారులు వేరు! అంటూ కరీనా చెప్పడం ఇవన్నీ రియాలిటీకి దగ్గరగా ఆకట్టుకున్నాయి. లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా వయాకామ్ 18 దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీగా నిర్మించింది. తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.