Begin typing your search above and press return to search.

'లాలా భీమ్' డీజే వెర్షన్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బాక్సులు బద్దలే..!

By:  Tupaki Desk   |   31 Dec 2021 2:15 PM GMT
లాలా భీమ్ డీజే వెర్షన్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బాక్సులు బద్దలే..!
X
పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''భీమ్లా నాయక్‌''. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నారు. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పవన్ నటిస్తుండగా.. అతనికి ధీటుగా నిలిచే డేనియల్ శేఖర్ పాత్రలో రానా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్లు - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.

ముఖ్యంగా 'లాలా భీమ్లా' సాంగ్ మిలియన్ల కొలదీ వ్యూస్ తో సోషల్ మీడియాలో సందడి చేసింది. అయితే న్యూ ఇయర్ కానుకగా అభిమానుల్లో జోష్ నింపేందుకు ఇప్పుడు ఈ పాటకు డీజే వెర్సన్ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ''అడవి పులి.. గొడవపడే.. ఒడిసిపట్టు.. దంచికొట్టు.. లాలా.. భీమ్లా..'' అంటూ వచ్చిన ఈ డీజే మిక్స్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

2022 కొత్త సంవత్సర వేడుకలు మరింత రీసౌండ్ వచ్చేలా.. సౌండ్ బాక్సులు బద్దలయ్యేలా 'లాలా.. భీమ్లా' పాట డీజే వెర్సన్ ఉందని అభిమానులు ఊగిపోతున్నారు. అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేసిన ఎస్ఎస్ థమన్.. ఇప్పుడు స్పీకర్లు బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో డీజే మిక్స్ తో ఊర్రూతలూగించారు. భీమ్లా నాయక్‌ క్యారెక్టరజేషన్ - యాటిట్యూడ్ తెలిసేలా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ సాంగ్‌ కు లిరిక్స్ రాయగా.. అరుణ్‌ కౌండిన్య ఎంతో హుషారుగా ఆలపించారు.

''భీమ్లా నాయక్'' చిత్రాన్ని మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌' సినిమాకి రీమేక్‌ గా రూపొందిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల అహం, ఆత్మగౌరవం మధ్య పోరు ఏవిధంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సముద్ర ఖని - బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.