Begin typing your search above and press return to search.
రాయల్ ఎన్ ఫీల్డ్ పై దర్జాగా రైడ్ కెళుతోంది..ఎవరీ లేడీ?
By: Tupaki Desk | 26 April 2020 10:22 AM GMTరయ్ రయ్ మంటూ ఎక్సలేటర్ రెయిజ్ చేసి ఆర్.ఎక్స్ 100 సౌండ్ వినిపిస్తేనే యూత్ ఫుల్ ఫిదా అయిపోయారు. డెబ్యూ కార్తికేయ ఫేవరెట్ స్టార్ అయిపోయాడు. అదేమో కానీ.. ఇక్కడ ఎవరీ పడతి .. ఏకంగా 650 సీసీ రాయల్ ఎన్ ఫీల్డ్ మీద అంత సునాయాసంగా క్రేజీగా రైడ్ కి వెళుతోంది?.. తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఇదంతా `100 సిరీస్` వెబ్ సిరీస్ కోసం లారా దత్తా వేసిన ఫీట్. ఎం.ఎస్.ధోనీలా.. సంజు సామ్సన్ లాగా బైక్ రైడ్ లో చెలరేగిపోయే అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు లారా దత్తా. హండ్రెడ్ సిరీస్ త్వరలోనే డిజిటల్ మాధ్యమం హాట్ స్టార్ లో టెలీకాస్ట్ కానుంది. ఈలోగానే రిలీజ్ చేసిన ట్రైలర్ నెటిజనుల్లో దూసుకెళుతోంది. వెబ్ సిరీస్ ల వెల్లవలో ఈ సిరీస్ కూడా దూసుకెళుతుందేమో చూడాలి. ట్రెండుకి తగ్గట్టే క్రైమ్ పోలీసింగ్ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ డ్రామాతో ఈ సిరీస్ ని తెరకెక్కించారని అర్థమవుతోంది. ఇందులో లారా దత్తా పోలీస్ అధికారిగా కనిపిస్తోంది. ఒక యువతి తన చుట్టూ అల్లుకున్న సమస్యలు.. వాటిని సాల్వ్ చేసేందుకు కొత్త మార్గం ఎంచుకున్న లేడీ పోలీస్ కథతో ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది.
లారా దత్తా దీనికోసం ఏదైనా ప్రాక్టీస్ చేసిందా? అంటే.. దాదాపు 20 ఏళ్ల క్రితం తాను కాస్త టీనేజీ స్పీడ్ తో ఉన్నప్పుడు బైక్ రైడింగ్ చేసేదిట. అది ఇప్పుడిలా అక్కరకొచ్చిందని చెబుతోంది. అయితే రాయల్ ఎన్ ఫీల్డ్ లాంటి భారీ వెహికల్ ఇంత గ్యాప్ తర్వాతా నడపాలంటే కాస్త షివరింగ్ వచ్చిందని లారా దత్తా చెబుతోంది. యంగ్ ఏజ్ లో నడిపాను. కానీ ముంబైకి వచ్చాక నడపలేదు. కానీ ఈ అనుభవం చాలా బావుంది అని తెలిపింది. అది కూడా ట్రైలర్ చూస్తే చీరలో బైక్ ని స్టైలిష్ గా నడిపిస్తూ కనిపించింది. ఆ సీన్ తనకే ఆశ్చర్యం కలిగించిందని తన కెరీర్ బెస్ట్ సీన్ అని ఉబ్బితబ్బిబ్బయిపోతోంది.
ఇక రాయల్ ఎన్ ఫీల్డ్ అంటే యూత్ ఎంతగా పిచ్చెక్కిపోతారో చెప్పాల్సిన పనే లేదు. రోడ్లపై హీరో హోండా బైకుల్ని మించి ఎన్ ఫీల్డ్ హెవీ బైక్ లు చెలరేగిపోతున్నాయి. ఇవి మేల్ ఫీమేల్ ఇరువురికి ఈజీ కావడంతో లేడీస్ కూడా నడిపేందుకు వెనకాడడం లేదు. ఇక రోడ్ పై పర్ఫెక్ట్ గ్రిప్ తో నడిచే వెహికల్ గా రాయల్ ఎన్ ఫీల్డ్ గౌరవం అందుకుంటోంది. యాక్సిడెంట్లు తక్కువగా జరిగే బైక్ కూడా ఇదే కావడం అడ్వాంటేజ్ గా మారింది. ఒకసారి అలవాటు పడితే ఇంత సౌకర్యం వేరొకటి ఉండదని చెప్పేవాళ్లు ఉన్నారు. కొన్ని మైనస్ లు ఉన్నా.. అవేవీ కనిపించవని ఫ్యాన్స్ చెబుతుంటారు.