Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసి అంతపని చేశాడా

By:  Tupaki Desk   |   10 Jan 2018 8:56 AM GMT
అజ్ఞాతవాసి అంతపని చేశాడా
X
పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి చిత్రంపై మందునుంచి వినిపించిన వివాదం ఒకటే. పవన్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని.. ఫ్రెంచ్ ఫిలిం నుంచి ఇన్ స్పిరేషన్ తీసుకున్నారనే టాక్ వచ్చింది. లార్గో వించ్ అనే మూవీ 10ఏళ్ల క్రితం విడుదల కాగా.. ఇప్పుడు ఆ సినిమానే అజ్ఞాతవాసిగా మలిచారనే టాక్ మరింత బలపడింది.

తెలంగాణలో మినహాయిస్తే.. మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ముందు రోజునుంచే ప్రీమియర్స్ టెలికాస్ట్ కాగా.. అవి పూర్తయేనాటికే లార్గో వించ్- అజ్ఞాతవాసి పోలికలు బయటకు వచ్చేశాయి. సహజంగా ఒకట్రెండు సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని.. సొంత వెర్షన్ రాసుకుంటాడని త్రివిక్రమ్ పై మార్క్ ఉంది. అయితే.. ఈ లార్గో వించ్ విషయంలో మాత్రం.. మరింత యథేచ్చగా వాడేసుకున్నాడని అంటున్నారు నెటిజన్స్. మరోవైపు ఇదే విషయాన్ని లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సల్లే కూడా కన్ఫాం చేసేశాడు. పారిస్ లో లార్గో వించ్ ప్రీమియర్ ను చూసిన ఈ డైరెక్టర్.. ఉదయాన్నే ట్వీట్ పెట్టేశాడు.

అజ్ఞాతవాసి మూవీ చూశానని.. తనకు బాగా నచ్చిందని చెప్పిన ఫ్రెంచ్ డైరెక్టర్.. కొన్ని ఇరికించిన కామెడీ సీన్స్ మినహా.. మిగిలిన మూవీ అంతా తన సినిమా ప్లాట్ బాగా దగ్గరగా ఉందని అభిప్రాయపడ్డాడు. స్వయంగా ఒరిజినల్ దర్శకుడే ఇలాంటి ట్వీట్ చేయడంతో.. అజ్ఞాతవాసిపై ఫ్రీమేక్ అనే ఆరోపణలు మరీ ఎక్కువయ్యాయి. అందుకే ఈ చిత్రం విడుదలకు ముందే టీ-సిరీస్ తో సెటిల్మెంట్ చేసుకుని ఉంటారని టాక్ వినిపిస్తోంది.