Begin typing your search above and press return to search.

సెటిల్మెంట్ సరిపోలేదట..

By:  Tupaki Desk   |   11 Jan 2018 10:17 AM IST
సెటిల్మెంట్ సరిపోలేదట..
X
ఈ ఏడాదిలో మొట్టమొదటి భారీ అండ్ క్రేజీ సినిమా అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ బేస్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ పై ఉన్న అంచనాలతో ఈ సినిమాపై విపరీతమైన బజ్ వచ్చింది. విడుదలకు ముందు నుంచే అజ్ఞాతవాసి లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమా కథను కాపీ కొట్టి తీశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ సినిమా రీమేక్ రైట్స్ పొందిన బాలీవుడ్ కు చెందిన టి.సిరీస్ న్యాయ పోరాటానికి సిద్ధమవడంతో వాళ్లతో సెటిల్మెంట్ చేసుకున్నారనే టాక్ కూడా ఉంది.

అజ్ఞాతవాసి కాపీ ఆరోపణలు లార్గో వించ్ ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ సల్లే దాకా కూడా వెళ్లాయి. సినిమా రిలీజయ్యాక ఆయన స్వయంగా చూడటంతో పాటు హెచ్చరిక లాంటి ఓ ట్విట్ కూడా పెట్టాడు. ‘‘టి-సిరీస్ తో చేసుకున్న సెటిల్మెంట్ సరిపోదేమో అని నేను భయపడుతున్నాను. ఇది కేవలం ఇండియాకు సంబంధించిన విషయం కాదు. అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది’’ అని జెరోమ్ సల్లే ట్వీట్ చేశాడు. అంటే ఓ రకంగా తనతో కూడా ఇష్యూ సెటిల్ చేసుకోవాలని.. లేకుంటే లీగల్ యాక్షన్ దాకా వెళ్లాల్సి వస్తుందన్నట్టుగా చెప్పకనే చెప్పాడు.

ఇంతవరకు బాగానే ఉన్నా అసలు లార్గో వించ్ సినిమా ఫ్రెంచ్ లో హిట్టేమీ కాదు. ఫట్టే... ఇప్పుడు దాదాపుగా అదే స్టోరీ ఎత్తేశారు అంటున్న అజ్ఞాతవాసి కూడా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. తన సినిమా గానీ.. ఇప్పుడు అజ్ఞాతవాసి కానీ సూపర్ డూపర్ హిట్టయి ఉంటే జెరోమ్ సల్లే రీమేక్ రైట్స్ మాటెత్తితే బాగుండేది.