Begin typing your search above and press return to search.
సాహో పరువు తీశాడుగా!
By: Tupaki Desk | 2 Sep 2019 7:49 AM GMTలార్గో వించ్. గత ఏడాది అజ్ఞాతవాసి రిలీజైనప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయిన సినిమా పేరిది. పవన్ మూవీ మాతృకగా హక్కులు కొనకుండా త్రివిక్రమ్ దీన్ని రీమేక్ చేశాడంటూ పెద్ద దుమారమే రేగింది. లోపాయకారి ఒప్పందాలతో ఆ గొడవేదో సద్దుమణిగిందనుకున్నారు కాని తెరవెనుక ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడంతో ఎక్కువ రోజులు దాని గురించి చర్చించే అవకాశం లేకపోయింది.
ఇప్పుడు సాహో పుణ్యమా అని మరోసారి లార్గో వించ్ వార్తల్లోకి వచ్చింది. ఇది కూడా ఇంచుమించు అదే కథంటూ సాహో మీద ఓ రేంజ్ లో ముప్పేట దాడి జరుగుతోంది. అజ్ఞాతవాసి టైంలో స్పందించిన దాని దర్శకుడు జెరోమ్ సల్లే మరోసారి ఆన్ లైన్ లోకి వచ్చాడు. నాకు ఇండియాలో మంచి ఫ్యూచర్ ఉందని ఒకసారి మొదటిసారి ఫెయిల్ అయ్యారు రెండో సారి అంతకన్నా చెత్తగా తీశారా అని ఇంకాస్త ఘాటుగా రెండోసారి కౌంటర్ ఇచ్చాడు.
ఇవి కాస్తా నేషనల్ మీడియాలోనూ హై లైట్ అయ్యాయి. ఇంతా చేసి సదరు జెరోమ్ సల్లే ఇప్పటిదాకా తీసిందే 7 సినిమాలు. ఇవి కాకుండా ఓ టెలివిజన్ మూవీ షార్ట్ ఫిలిం తీశాడు. ఇంతే ఇతగాడి ట్రాక్ రికార్డు. లార్గో వించ్ కూడా యావరేజ్ మూవీనే. ఇప్పుడీ సాహో అజ్ఞాతవాసిల పుణ్యమా ఇతగాడు మన మీడియాలో టాక్ అఫ్ ది టౌన్ గా మారాడు. స్ఫూర్తి పేరుతో కథల విషయంలో కాపీలు కొడితే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్తుందో ఇదే మంచి ఉదాహరణగా నిలుస్తోంది