Begin typing your search above and press return to search.
ఆమె.. తేజూ అంటూ మీద చెయ్యేసిన వేళ
By: Tupaki Desk | 31 July 2016 4:54 AM GMTమామూలుగా మన ఆడియో ఫంక్షన్లలో హీరోయిన్లు ఏదో అలా వోట్ ఆఫ్ థ్యాంక్స్ అన్నట్లు ఒక స్పీచ్ ఇచ్చేసి వెళిపోతుంటారు. తెలుగు కాస్త బాగా వచ్చిన సమంత వంటి భామలైతే ఆడియన్సును కాస్త ఆహ్లాదపరిచి బయలుదేరతారు. కాకపోతే మనోళ్ళు హీరోను సార్ సార్ అంటూ పొగడటమో.. లేకపోతే బెస్ట్ కో-స్టార్ అంటూ మాటలతో ఎత్తేయడమే కాని.. చేతల్లో ఎఫక్షన్ అనేదే చూపించరు. కాని ఒక బ్రెజిలియన భామ పద్దతి ఎలా ఉంటుంది? అవును, మీరు ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది.
బ్రెజిల్ నుండి వచ్చి ఇండియన్ మోడలింగ్ సర్క్యూట్లో దుమ్ములేపుతున్న భామ లరిస్సా బొనేసి. ఈ అమ్మడు ఇప్పుడు తిక్క సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్నుగా పరిచయం అవుతోంది. అయితే నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో అమ్మడు మాట్లాడుతూ.. థ్యాంక్యూ తేజూ ఈ ఛాన్సిచ్చినందుకు అంటూ.. హీరో సాయిధరమ్ తేజ్ ను దగ్గరకు తీసుకోవడమే కాదు.. అతని భుజంపై ఏదో పెద్దన్నయ్య టైపులో చేయి వేసి థ్యాంక్స్ చెప్పింది. అలా ఆమె చెయ్యేసిన వేళ ఆడియన్స్ అందరూ కెవ్వు కేక అంటూ అరుపులే అరుపులు. తేజూ కూడా నవ్వుల్లో మునిగిపోయాడు.
కాని ఆ తరువాతే అసలైన ఎమోషనల్ సీన్ చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఇంతమంది జనం ముందు తొలిసారి మాట్లాడుతున్న లరిస్సా కళ్ళలో నీళ్ళొచ్చేశాయి. బ్రెజిల్ లో మా అమ్మానాన్న ఇప్పుడు ఇదంతా చూస్తూనే ఉంటారు. థ్యాంక్యూ ఆల్ అంటూ అమ్మడు కన్నీటి పర్యంతమైంది. ఆ ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయింది. ఎక్కడో బ్రెజిల్ నుండి ఇక్కడకు వచ్చి ఒక్క అవకాశం దక్కించుకుంటే.. ఆ కిక్ అలాగే ఉంటుంది మరి.