Begin typing your search above and press return to search.

వీపు అందం చూపిస్తూ మతి పోగొడుతోంది

By:  Tupaki Desk   |   6 Jun 2023 1:30 PM IST
వీపు అందం చూపిస్తూ మతి పోగొడుతోంది
X
తిక్క... నెక్ట్స్ ఏంటి సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ లారిస్సా బోనేసి. బ్రెజిల్ కు చెందిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేస్తోంది. అందంగా ఉండే ఈమె తన అందాన్ని మరింత అందంగా కనిపించేలా ఆకట్టుకునే కాస్ట్యూమ్స్ తో కన్నుల విందు చేస్తూ ఉంది.

తాజాగా ఈమె ఇలాంటి హాట్ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. సాధారణంగానే అందంగా ఉండే లారిస్సా బోనేసి ఈ ఔట్ ఫిట్ లో మరియు ఈ ఫోజ్ లో మరింత అందంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ స్థాయి అందం ఉన్నా కూడా పాపం అదృష్టం కలిసి రాకపోవడంతో ఆఫర్లు పెద్దగా రావడం లేదు. అందాల లారిస్సా బోనేసి ముందు ముందు అయినా ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి. ఇక నుండి తెలుగు సినిమాల్లోనే కాకుండా ఇతర భాషల సినిమాల్లో కూడా ఈమె నటించాలని ఆశ పడుతోంది.

హీరోయిన్‌ గా లారిస్సా బోనేసి చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా విదేశీ ముద్దుగుమ్మ అవ్వడం వల్ల ఈమెకు ఇక్కడ మంచి పాపులారిటీ దక్కింది. ముందు ముందు సోషల్‌ మీడియాలో ఇలాగే అందంగా కనిపించే ఫోటోలను షేర్‌ చేస్తే తప్పకుండా బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.