Begin typing your search above and press return to search.
అనుపమ గ్లామర్ గేర్ వేయక తప్పదేమో!
By: Tupaki Desk | 24 Dec 2019 9:39 AM GMTకేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తక్కువ సినిమాల తోనే తెలుగు ప్రేక్షకుల లో మంచి గుర్తింపే సాధించింది. 'ప్రేమమ్'.. 'అ ఆ' 'శతమానం భవతి' లాంటి హ్యాట్రిక్ హిట్లతో తన టాలీవుడ్ ప్రయాణాన్ని జోరుగా ప్రారంభించింది. అయితే మధ్యలో కొన్ని ఫ్లాపులు పలకరించడంతో కెరీర్ స్లో అయిపోయింది. ఈమధ్య అవకాశాలు కూడా తగ్గి పోయాయి. అయితే కాస్త రిలీఫ్ అన్నట్టుగా ఈమధ్య బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించిన 'రాక్షసుడు' హిట్టు గా నిలిచింది. అయినా ఇప్పటికీ పెద్దగా కొత్త ఆఫర్లు రావడం లేదట.
దీంతో ఏ అవకాశం వచ్చినా వెంటనే అందిపుచ్చుకోవాలనే ఆత్రం ఎక్కువైందట. ఎవరైనా ఫిలిం మేకర్స్ స్క్రిప్ట్ తో అనుపమ దగ్గరికి వస్తే చాలు వారికి వెంటనే ఒకే చెప్పేస్తోందట. స్క్రిప్ట్ వినడం.. ఆలోచించడం లాంటివాటి పై అసలు శ్రద్ధ పెట్టడం లేదట. ఇంత ఓపెన్ గా ఉన్నప్పటికీ అనుపమకు టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదట. మంచి బ్యానర్లు.. కాస్త ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలకు అనుపమ పేరును అసలు పరిశీలించడం లేదట. దీంతో అనుపమకు ఏం చేయాలో పాలుపోవడంలేదట.
అనుపమ కు మొదటి నుంచి పక్కింటమ్మాయి ఇమేజ్ ఉంది. హాటు షోలకు..గ్లామర్ ప్రదర్శనలకు ఎప్పుడూ దూరమే. సినిమాలు హిట్లు అవుతుంటే ఇలాంటి వాటితో కెరీర్ కు ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ కెరీర్ స్లో అయినప్పుడు మాత్రం అవే ముఖ్యం అవుతాయి. ఈ జెనరేషన్ హీరోయిన్లు ఎలా ఉన్నారంటే టెంప్ట్ రవి కే చుక్కలు చూపించేంత గ్లామర్ ను అవలీలగా ఒలక బోస్తూ బోల్డు బోల్డ్ నెస్ రంగరించి యూత్ కు గాలం వేస్తున్నారు. ఇలాంటప్పుడు అనుపమ కూడా తన రూటు మార్చి ఇన్స్టా ను హీటెక్కించేలా నాలుగు కలర్ ఫుల్ బికినీలు తగిలిస్తే ఆటోమేటిగా క్రేజీ ఆఫర్లు వస్తాయి. లేక పోతే బేరాలు రావు.. 'యాపారం' ఉండదు!!