Begin typing your search above and press return to search.
సాహో మాట మీద నిలబడుతుందా ?
By: Tupaki Desk | 14 May 2019 5:06 AM GMTబాహుబలి 2 తర్వాత రెండేళ్ల గ్యాప్ ని భరించి అభిమానులు ఎదురు చూస్తున్న సాహో విడుదలకు ముందు చెప్పిన ప్రకారం కేవలం మూడు నెలల టైం మాత్రమే ఉంది. అంటే సరిగ్గా 90 రోజుల తర్వాత ఆగస్ట్ పదిహేనునాడు డార్లింగ్ థియేటర్లలో అడుగు పెట్టాలి. ఇంతకు ముందు చెప్పారు కానీ దీనికి సంబంధించి ఆ తర్వాత యువి సంస్థ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. ఖచ్చితంగా వస్తుందనే సమాచారం లేదు. ఫ్యాన్స్ అయితే గట్టి నమ్మకంతోనే ఉన్నారు. షూటింగ్ పూర్తయినట్టుగా ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఓ పాట బాలన్స్ తో పాటు ఇంకో యాక్షన్ ఎపిసోడ్ కూడా తీయాల్సి ఉందని టాక్ జరుగుతోంది.
ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాని అయోమయం అయితే నెలకొని ఉంది. మల్టీ లాంగ్వేజ్ వెర్షన్స్ కావడంతో మీడియా రిలేషన్స్ విషయంలో యువి టీమ్ కాస్త వెనుకబడి ఉంది. ఇప్పటిదాకా షేడ్స్ అఫ్ సాహో పేరుతో రెండు మేకింగ్ వీడియోలు తప్ప ఇంకేమి బయటికి రాలేదు. ఇప్పుడు చేతిలో ఉన్న అతి తక్కువ గడువుతో సాహో డెడ్ లైన్ మీట్ అవుతుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్ ఆషామాషీగా చేస్తే సరిపోదు.
దేశమంతా తిరగాల్సి ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఒకటి రెండు చేస్తే సరిపోదు. భాషకొకటి చొప్పున చేస్తే హైప్ పెరుగుతుంది. అసలే 200 కోట్ల బడ్జెట్. రికవర్ చేయడం ఎంత ఇమేజ్ ఉన్నా ప్రభాస్ కు మరీ అంత సులువైతే కాదు. పైగా బాహుబలి లాగా సాహో ఫాంటసీ మూవీ కాదు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇంకా ఆడియో రిలీజ్ టీజర్ ట్రైలర్ లాంచ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. వీటికి టైంని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే సాహో చెప్పిన ఆగస్ట్ 15 మాటకు కట్టుబడి ఉండొచ్చు. ఏ మాత్రం మిస్ అయినా ఇతర సినిమా విడుదలలు గందరగోళంలో పడతాయి