Begin typing your search above and press return to search.

'ఎఫ్‌ 4' ఉంటుంది, కాని..!

By:  Tupaki Desk   |   29 May 2022 6:33 AM GMT
ఎఫ్‌ 4 ఉంటుంది, కాని..!
X
మూడున్నర సంవత్సరాల క్రితం వచ్చిన ఎఫ్‌ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అప్పుడే ఎఫ్‌ 3 కి సంబంధించిన ప్రకటన వచ్చింది. కరోనా ఇతరత్ర కారణాల వల్ల ఎఫ్‌ 3 ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఎఫ్ 2 సీక్వెల్‌ అన్నట్లుగా ఎఫ్ 3 విడుదల అయ్యింది. ఎఫ్ 2 కథ కి ఎఫ్‌ 3 కథకు ఎక్కడ సంబంధం లేకుండా ఉంది. కేవలం పాత్రలను కంటిన్యూ చేయడం జరిగింది.

ఎఫ్‌ 3 కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన నేపథ్యంలో ఎఫ్‌ 4 ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఎఫ్‌ 4 గురించి ఇప్పటికే పలు సార్లు దర్శకుడు అనీల్ రావిపూడి మరియు దిల్‌ రాజు లు కూడా స్పందించారు. హీరోలు అయిన వెంకటేష్ మరియు వరుణ్‌ తేజ్ లు కూడా ఎఫ్‌ 4 ఉంటుందనే ఇటీవల ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. వరుణ్‌ ఒక ఇంటర్వ్యూలో ఎఫ్‌ 4 కోసం రెండు మూడు స్టోరీ లైన్స్ ను కూడా దర్శకుడు అనిల్ రావిపూడి రెడీ చేశాడు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఎఫ్‌ 4 గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎఫ్‌ 4 ఖచ్చితంగా ఉంటుంది కాని హీరోలు హీరోయిన్స్ వేరే ఉండవచ్చు అంటూ అనిల్ రావిపూడి టీమ్‌ మెంబర్స్ మరియు దిల్‌ రాజు కాంపౌండ్‌ కు చెందిన వారు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. ఎఫ్‌ 3 సినిమా నే వేరే నటీ నటులతో చేయాలనుకున్నాడు అనీల్ రావిపూడి. కాని ఎఫ్ 2 యొక్క మ్యాజిక్ మరియు ఫ్లేవర్‌ కంటిన్యూ అవ్వదనే ఉద్దేశ్యంతో మొత్తం వారినే దించాడు.

ఎఫ్‌ 2 లో నటించిన వారినే ఎఫ్ 3 లో నటింపజేయడం వల్ల భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి నటింపజేయాల్సి వచ్చింది. తద్వారా కాస్త బడ్జెట్‌ ఎక్కువ అయ్యింది అనేది దిల్‌ రాజు అభిప్రాయం. అందుకే ఎఫ్ 4 చేస్తే వేరే హీరోలు హీరోయిన్స్ తో చేయడం బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చాడట. ఆ విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అనిల్ రావిపూడి త్వరలో బాలకృష్ణ 108వ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అవ్వొచ్చిందట. అనిల్ రావిపూడి తదుపరి సినిమాల విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ అనేది వచ్చిన నేపథ్యంలో ఎఫ్‌ 4 కు చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎఫ్‌ 4 కోసం ఇప్పటి నుండే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఎఫ్‌ 4 సినిమా ను ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా అనిల్ రావిపూడి చేస్తాడని చాలా మంది ఎదురు చూస్తున్నారు.