Begin typing your search above and press return to search.

రాజ్ త‌రుణ్ తో పెళ్లి.. లాస్య‌ వివ‌ర‌ణ ఇదీ

By:  Tupaki Desk   |   14 Feb 2017 4:29 AM GMT
రాజ్ త‌రుణ్ తో పెళ్లి.. లాస్య‌ వివ‌ర‌ణ ఇదీ
X
గ‌త ఏడాది ఎవ్వ‌రూ ఊహించ‌ని ఒక రూమ‌ర్ టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌.. యాంక‌ర్ లాస్య‌ను పెళ్లాడ‌బోతున్నాడంటూ రూమ‌ర్ రాయుళ్లు ఒక వార్త పుట్టించేశారు. అది మీడియాలో.. సోష‌ల్ మీడియాలో బాగా ప్ర‌చార‌మైపోయింది. నిప్పు లేనిదే పొగ రాదు క‌దా అన్న‌ట్లు చాలామంది ఇది నిజ‌మేమో అనే అనుకున్నారు. కానీ ఇది శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని త‌ర్వాత తేలింది. దీనిపై తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో్ లాస్య వివ‌ర‌ణ ఇచ్చింది. అస‌లేం జ‌రిగిందో ఆమె మాట‌ల్లోనే..

‘‘నేను రాజ్ తరుణ్ తో ఎప్పుడూ క‌లిసి ప‌ని చేయలేదు. నేను ఆడియో వేడుక‌ల‌కు యాంక‌రింగ్ చేస్తుంటా. అలా చాలామంది హీరోల్ని క‌లిశా. మ‌రి రాజ్ తరుణ్ తోనే ఎందుకు లింక్ పెట్టారో అర్థం కాలేదు. ఒక ఆడియో వేడుక‌లో నేను రాజ్ తరుణ్‌ తో సెల్ఫీ తీసుకున్నా. ఐతే ఆ ఫొటోలో రాజ్ తరుణ్ తో పాటు నేను.. సింగర్ నోయల్ కూడా ఉన్నాడు. ఐతే ఆ ఫొటోలో నోయల్ ను క‌ట్ చేసి.. మా ఇద్దరిది ఫొటో పెట్టి రూమర్ పుట్టించారు. ఆ రోజు రాజ్ తరుణ్ తో సెల్ఫీ తీసుకోవ‌డ‌మే తప్పయిందనుకున్నా. యాంక‌ర్ రవితోనూ న‌న్ను లింక‌ప్ చేశారు. కానీ మేమిద్ద‌రం షో చేశాం కాబ‌ట్టి అలాంటి వార్త‌లు రావ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. కాని రాజ్ తరుణ్ తో పెళ్లి అని ఎందుకు రాశారో తెలియ‌దు. మా ఇద్దరికీ అసలు పరిచయమే లేదు’’ అని లాస్య స్ప‌ష్టం చేసింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/