Begin typing your search above and press return to search.
రెండు సార్లు పెళ్లి విషయంలో ఎమోషనల్ గా క్లారిటీ ఇచ్చిన లాస్య
By: Tupaki Desk | 16 Oct 2020 11:50 AM GMTయాంకర్ లాస్య గురించి తెలియని బుల్లి తెర ప్రేక్షకుడు ఉండడేమో. ఎందుకంటే ఆమె బుల్లి తెరపై ఒకానొక సమయంలో ఏ షోలో చూసినా స్టేజ్ షోలో చూసినా కూడా ఆమె కనిపించేది. రవి మరియు లాస్య కలిసి చేసిన షోలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. బుల్లి తెరపై యాంకర్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అనూహ్యంగా ఆమె మంజునాథ్ ను పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. పైగా అతడితో ఆమెకు ఏడు సంవత్సరాల క్రితమే పెళ్లి అయ్యింది. అది కుటుంబ సభ్యుల సమక్షంలో మరోసారి అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయమై మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న లాస్య తన ఒకే పెళ్లి రెండు సార్లు విషయమై ఎమోషనల్ గా క్లారిటీ ఇచ్చింది.
ఒక పల్లెటూరుకు చెందిన కుటుంబం నుండి వచ్చిన లాస్య మంజునాధ్ ను ప్రేమించడం ఆమె తండ్రికి నచ్చలేదట. మంజునాథ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత మూడు సంవత్సరాల పాటు నాన్న మాట్లాడలేదని కన్నీరు పెట్టుకుంది. నాన్న ను బాధపెట్టి పెళ్లి చేసుకున్నాను. ఆయన బండిపై వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యింది. ఆసమయంలో చాలా గాయాలు అయ్యాయి. లక్షన్నర కోసం పది పదిహేను మంది వద్ద అయిదు వేలు పదివేల చొప్పున అప్పు తీసుకుని నాన్నను బాగు చేయించుకున్నాను. ఎవరిని అయితే అస్సలు ఇష్టపడలేదో అదే మంజునాథ్ ను తన కొడుకు అంటూ మానాన్న ఇప్పుడు అంటూ ఉంటాడు అంది.
మంజునాథ్ ను పెళ్లి చేసుకుని ఏడు సంవత్సరాలు అయినా కూడా అతడికి ఎలాంటి ఐడెంటిటీ ఇవ్వలేక పోయాను. షూటింగ్ సెట్ కు వచ్చి డ్రాప్ చేసి వెళ్తుంటే నేను కజిన్ అంటూ చెప్పేవాడిని కాని భర్త అని చెప్పుకోలేక పోయాను అంటూ కన్నీరు పెట్టుకుంది. రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్న మాకు కుటుంబ సభ్యులు మళ్లీ పెళ్లి చేయడంతో మా లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందని కన్నీరు పెట్టుకుని నవ్వుతు చెప్పింది లాస్య.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న బలమైన కంటెస్టెంట్స్ లో లాస్య కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సింపుల్ గృహిణిగా ఆమె ప్రవర్తించే తీరు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుంది. ఆమె అందమైన మొహం మరియు యాక్టివ్ గా వ్యవహరించడం వంటి కారణాల వల్ల లాస్య టాప్ 5 కంటెస్టెంట్ అంటున్నారు. లాస్య అభిమానులు ఆమె విజేతగా కూడా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.