Begin typing your search above and press return to search.

భారత రత్నను అవమానించిన అమెరికా పత్రిక

By:  Tupaki Desk   |   1 Jun 2016 10:16 AM GMT
భారత రత్నను అవమానించిన అమెరికా పత్రిక
X
భారతీయులంటే విదేశీ పత్రికలకు ఎప్పుడూ చిన్నచూపే. ప్రతీ విషయంలోనూ మనవాళ్లను, మన మేథో సంపత్తి స్థాయిని అవమానిస్తూనే ఉంటారు. ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్ అయితే.. కార్టూన్స్ తో ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. గతంలో మనోళ్లు మార్స్ మిషన్ ను చేపట్టినపుడు, పారిస్ వాతావరణ సదస్సులో పాల్గొన్నపుడు.. దేశాన్ని అవమానించేలా కార్టూన్స్ వేసి అవమానించిన చరిత్ర ఈ పత్రికది. ఇప్పుడీ న్యూ యార్క్ టైమ్స్ ఏకంగా భారత రత్న అవార్డు గ్రహీత అయిన లతా మంగేష్కర్ ను అవమానించిది.

తాజాగా తన్మయ్ భట్ చేసిన ఓ స్నాప్ చాట్ వీడియో దేశంలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వివాదంపై ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో సచిన్ - లతా మంగేష్కర్ ల ప్రస్తావన తీసుకొచ్చిన న్యూయార్క్ టైమ్స్.. ఈ భారత కోకిలను మాత్రం అవమానించింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. లతా మంగేష్కర్ ఓ సోకాల్డ్ సింగర్ మాత్రమే. ఏదో సినిమాల్లో పాటలకు - డ్యాన్స్ నెంబర్లకు ప్లే బ్యాక్ పాడుకునే ఓ సాధారణ సింగర్. భారత దేశ సంగీత చరిత్రలోనే అద్వితీయం అనదగ్గ స్థాయిలో చరిత్ర సృష్టించిన లతామంగేష్కర్ ను.. ఓ సాధారణ స్థాయి పాటలు పాడుకునే వ్యక్తిగా వర్ణించింది న్యూయార్క్ టైమ్స్.

భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకుని, ఎంతో ఘనకీర్తి సాధించి, దశాబ్దాలుగా పాటలు పాడుతూ, సంగీతానికి తన వంతు సేవ చేస్తున్న అంతటి మహా మనిషిని పట్టుకుని.. సోకాల్డ్ సింగర్ అని న్యూయార్క్ టైమ్స్ అభివర్ణించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే ఆ పత్రిక క్షమాపణ చెప్పాలని డిమాండ్ పెరుగుతోంది.