Begin typing your search above and press return to search.
నేను బతికానంటే..గాన కోకిల ఎమోషన్!
By: Tupaki Desk | 3 Dec 2019 5:30 PM GMTగాన కోకిల లతా మంగేష్కర్ గత నెల 11న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెని కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లోని ఇంటెన్సీవ్ కేర్ లో చేర్చించారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. లతాజీ ఇక కష్టమే అని షోషల్ మీడియా వేదికగా జోరుగానే ప్రచారం కూడా జరిగింది. ఇవన్నీ లతా మంగేష్కర్ అభిమానుల్ని కలవపాటుకు గురిచేశాయి.
దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు భారతరత్న మేటి గాయని.. బ్రతకాలని.. క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని ప్రార్థించారు. గత ఏడు దశాబ్దాలుగా గాయనిగా సేవలందిస్తున్న లత మంగేష్కర్ ఇప్పటి వరకు 30 వేల పై చిలుకు పాటలు పాడారు. గాన కోకిలగా పేరుతెచ్చుకున్న ఆమె పాట బాలీవుడ్ లో ఇప్పటికి ఎవర్ గ్రీనే. అలాంటి ఆమె అస్వస్థకు గురి కావడం దేశ వ్యాప్తంగా వున్న లతా అభిమనుల్నికలవరానికి గురిచేసింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా వుందని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
``మీ ప్రార్థనలే బతికిచాయి. నేను బతికానంటే అందుకు కారణం మీ ప్రార్థనలే. అభిమానులకు రుణపడి ఉంటాను`` అంటూ ఈ సందర్భంగా గాన కోకిల లతా మంగేష్కర్.. ఆమె కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. లతాజీ తిరిగి గొంతు సవరించుకుని పాడేంతగా హుషారుగానే ఉన్నారన్న వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.