Begin typing your search above and press return to search.
దేశంలో అత్యున్నత అవార్డులన్నీ లతాజీకే!
By: Tupaki Desk | 6 Feb 2022 6:31 AM GMTనేపథ్యగాయకుడిగా ఎస్.పి.బాల సుబ్రమణ్యం విశ్వవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించారు. ఆయన కెరీర్ లో అందుకోని సత్కారం లేదు. ఆయన సాధించిన అత్యున్నత పురస్కారాలన్నీ గొప్ప హోదాకి దర్పణంగా నిలిచాయని చెప్పాలి. భారతదేశంలో అంతకుమించి అనేలా నేపథ్యగాయని లతా మంగేష్కర్ గౌరవం అందుకున్నారు. నేపథ్య గాయనిగా అసాధారణ ఎదుగుదలతో కెరీర్ సాగింది. తన జీవితంలో లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నారు. భారతరత్న- పద్మవిభూషణ్- పద్మభూషణ్ - దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను దక్కించుకున్న మేటి గాయనిగా భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించారు.
హిందీ చిత్రాల కోసం వందలాది పాటలకు ప్లేబ్యాక్ పాడిన లతాజీ భారతీయ సినిమాకి ఒక ఐకాన్ అనడంలో సందేహం లేదు. ఆమె మరాఠీ - బెంగాలీ సహా అనేక ప్రాంతీయ భాషలలో కూడా పాడారు.
లతాజీ `నైటింగేల్ ఆఫ్ ఇండియా`గా ప్రసిద్ధి చెందారు. 1945లో మధుబాల నటించిన మహల్ చిత్రంలోని `ఆయేగా ఆనేవాలా..` పాటను ఆలపించగా.. శ్రీమతి మంగేష్కర్ కు తొలి హిట్ దక్కింది. అక్కడి నుండి లతా మంగేష్కర్ కెరీర్ చాలా ఎత్తుకు ఎదిగింది. ఆమె బైజు బావ్రా- మదర్ ఇండియా- మొఘల్-ఎ-ఆజం,.. బర్సాత్ - శ్రీ 420 వంటి చిత్రాలకు పాడారు. కెరీర్ లో ఎన్నో గొప్ప హిట్ పాటల్ని పాడారు. ఆమె నౌషాద్ రాసిన రాగ-ఆధారిత కంపోజిషన్ లను పాడారు.
మధుమతిలో సలీల్ చౌదరి లిల్టింగ్ ట్రాక్ లు ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందించాయి. బీస్ సాల్ బాద్- ఖండన్ - జీనే కీ రాహ్ చిత్రాలతో మరో మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. పరిచయ్- కోరా కాగజ్ -లేకిన్ చిత్రాలకు ఉత్తమ నేపథ్య గాయనిగా మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.
పాకీజా- అభిమాన్- అమర్ ప్రేమ్- ఆంధీ- సిల్సిలా- చాందినీ- సాగర్- రుడాలి - దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే ఆమె కెరీర్ లో ఇతర మరపురాని చిత్రాలు. లతా మంగేష్కర్ అత్యంత ప్రసిద్ధ పాటలలో దేశభక్తి కూర్పు ఏ మేరే వతన్ కే లోగో- 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో మరణించిన భారత సైనికులను స్మరించుకుంటూ ఈ పాటను 1963లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో ప్రదర్శించారు. రాష్ట్రపతి ఎస్ రాధాకృష్ణన్ - ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో లతా మంగేష్కర్ దీనిని ప్రత్యక్షంగా పాడారు.
లతా మంగేష్కర్ కొన్ని మరాఠీ చిత్రాలకు సంగీతం అందించారు. 1965లో సాధి మనసే చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఆమె కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. వాటిలో 1990ల లెకిన్ గొప్ప గుర్తింపును తెచ్చింది. ఈ సినిమాలో ఆమె కూడా పాడింది.
92 వయసులో నింగికేగారు!
లెజెండరీ నేపథ్యగాయని.. గానకోకిల లతా మంగేష్కర్ 92 ఏళ్ళ వయసులో మరణించారు. కోవిడ్ తో ఆసుపత్రిలో చేరిన తర్వాత లతా మంగేష్కర్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని కబురు అందగా అంతా సంతోషించారు. కానీ ఇంతలోనే మేటి గాయని నింగికేగారనే వార్తను వినాల్సి వచ్చింది. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో లతాజీ మరణించారు.