Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్ వెనక్కు తగ్గుతున్నాడా..?
By: Tupaki Desk | 1 Oct 2021 6:36 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''గని''. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2021 దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ను మరో నెల వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి 'గని' చిత్రాన్ని జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయింది. పరిస్థితులు చక్కబడటంతో దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాని డిసెంబర్ 3వ తేదీకి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
'గని' వరుణ్ తేజ్ కెరీర్ లో వస్తున్న ఈ 10వ సినిమా. ఇందులో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి వరుణ్ భారీ వర్కౌట్స్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నవీన్ చంద్ర ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ పిక్చర్స్ - అల్లు బాబీ కంపెనీ పతాకాలపై అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అబ్బూరి రవి ఈ సినిమాలో డైలాగ్స్ రాస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్ - వ్లాడ్ రింబర్గ్ ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు. 'ఎఫ్ 2' 'గద్దలకొండ గణేష్' వంటి వరుస విజయాలు తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న ''గని'' సినిమా ఎలాంటి సక్సెస్ అవుతుందో చూడాలి.