Begin typing your search above and press return to search.
#స్పెషల్.. గాడ్ ఫాదర్ సిస్టర్ శివగామి?
By: Tupaki Desk | 16 Nov 2021 11:19 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ బ్లాక్ బస్టర్ `లూసీఫర్` తెలుగులో `గాడ్ ఫాదర్` టైటిల్ తో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని భారీ కాన్వాస్ పై తెరకెక్కిస్తున్నారు. చిరంజీవితో పాటు ఇందులో బిగ్ స్టార్స్ నటిస్తున్నారు. ఓ కీలకమైన పాత్రలో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం ఉంది. చిరు-సల్మాన్ ల తో ఓ పాటని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రమోషన్ సాంగ్ నా? లేక కథలో భాగంగా ఉంటుందా? అన్నది చూడాలి. అలాగే మాతృక ప్రకారం.. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది.
ఒరిజినల్ వెర్షన్ లో ఆ పాత్రను మంజు వారియర్ పోషించారు. అయితే ఇటీవల ఆ పాత్ర కోసం పలువురి పేర్లను పరిశీలించడం ఆసక్తిని కలిగించింది. పేరున్న నటినే రీమేక్ వెర్షన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. నయనతార..శోభన పేర్లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అయితే వాళ్లకంటే రమ్యకృష్ణ అయితే ఇంకా బెటర్ గా ఉంటుందనే ఆలోచన మేకర్స్ కి వచ్చిందట. సీనియర్ నటిగా శివగామిగా పాపులరైన రమ్యకృష్ణనే ఒప్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అదే గనుక నిజమైతే ఆ పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఖాయం. ముఖ్యమంత్రి కుమార్తెగా రమ్యకృష్ణ నటించాల్సి ఉంటుంది. చిరంజీవిని సోదరుడిగా భావించే పాత్ర ఇది.
అదే గనుక నిజమైతే చిరంజీవి తో చెల్లెలి పాత్రలో నటించడం రెండవ సారి అవుతుంది. గతంలో `చక్రవర్తి` అనే సినిమాలో రమ్యకృష్ణ చిరంజీకి చెల్లి పాత్రలో నటించారు. ఆ తర్వాత మెగాస్టార్- రమ్యకృష్ణ జంటగా చాలా సినిమాల్లో కలిసి నటించారు. అలాగే గాడ్ ఫాదర్ చిత్రంలో సీఎం కుమారుడి పాత్రకు సత్యదేవ్ ని తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఈ ప్రచారం లో నిజమెంత? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. `గాడ్ పాదర్` షూటింగ్ లో మెగాస్టార్ గత రెండు నెలలుగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగు-తమిళంలో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండలోనూ కీలక పాత్రను పోషిస్తున్నారు.