Begin typing your search above and press return to search.
#పుష్ప.. మళ్లీ మళ్లీ ఆలస్యమేనా.. అంతా నిరాశేనా!
By: Tupaki Desk | 28 Sep 2021 5:30 AM GMTటాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ రిలీజెస్ జాబితాలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్.. మెగాస్టార్ ఆచార్య.. యష్ - కేజీఎఫ్ 2 చిత్రాలు భారీ కాన్వాసుతో తెరకెక్కి అత్యంత భారీగా రిలీజ్ కానున్నాయి. ఇక వీటితో పాటు పుష్ప చిత్రాన్ని అత్యంత భారీగా పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేసేందుకు బన్ని-సుకుమార్ టీమ్ సన్నాహకాల్లో ఉంది.
ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సినది సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. మొదటి వేవ్ ... సెకండ్ వేవ్ మహమ్మారీ పుష్పరాజ్ ని వెంటాడి తీవ్రంగానే ఇబ్బంది పెట్టాయి. ఆ క్రమంలోనే 2021 సమ్మర్ అనుకున్నా అవ్వలేదు. ఇక ఈ చిత్రం దసరా బరిలో వస్తుందని కథనాలొచ్చినా అదీ పాజిబుల్ కాలేదు. చివరికి క్రిస్మస్ 2021 రిలీజ్ అంటూ ఇటీవల ప్రచారమైంది. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యపడదనేది తాజా గుసగుస. అందుకు కారణం అక్టోబర్ వచ్చేస్తున్నా ఇంకా నెలరోజుల షూటింగ్ పెండింగ్ లో ఉండడమేనని కథనాలొస్తున్నాయి.
పుష్ప ఇంకా ఎంత పెండింగ్ ?
ఇంకా పెండింగ్ చిత్రీకరణ ఎంత అన్నది ఆరా తీస్తే... నిజానికి సెప్టెంబర్ నెలాఖరులోగా సినిమా షూటింగ్ పూర్తి చే సి డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ప్రస్తుత స్థితిని పరిశీలిస్తే.. ప్రణాళిక ప్రకారం సినిమాను విడుదల చేయడం అసాధ్యమని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల పైగానే చిత్రీకరణ పెండింగ్ లో ఉందని సమాచారం. ఇప్పటికి ఒక పాటను మాత్రమే చిత్రీకరించారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్ లతో పాటు రెండు పెండింగ్ పాటలు చిత్రీకరించాల్సి ఉంది. దీనిని బట్టి పుష్ప చిత్రీకరణ నవంబర్ మొదటి వారంలో ముగియవచ్చని అంచనా. షూట్ పూర్తయిన వెంటనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని దర్శకనిర్మాతలు ప్రకటిస్తారని ఫిలింనగర్ లో గుసగుసలు వైరల్ అవుతున్నాయి.
పుష్పకు వరుణుడి ఆటంకాలు ..!
పుష్పకు తొలి నుంచి అన్నీ ఇన్నీ అడ్డంకులు కావు. కరోనా వైరస్ మహమ్మారీతో పాటు వరుణుడు కూడా బిగ్ బ్రేక్ వేస్తుండడం చర్చనీయాంశమైంది. ఇటీవల మారేడుమిల్లిలో ఆగని వానలు ఇబ్బందికరంగా మారాయి. కుండపోత వర్షం పడుతుంటే అక్కడ షూట్ చేసే పరిస్థితి లేదు. దీంతో పుష్ప సినిమాకి సంబంధించి షెడ్యూల్ చేసుకున్న డేట్లు తారుమారు అయ్యాయి. ఆల్టర్నేట్ ఆలోచించిన సుక్కూ టీమ్ కాకినాడలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ ప్లాన్ చేశారు. కాకినాడ పోర్టు- మడ అడువుల దగ్గర సినిమాను తెరకెక్కించారని కథనాలొచ్చాయి. ఈ లోపు మారేడుమిల్లిలో వానలు ఆగితే అక్కడికి మళ్లీ యూనిట్ ని షిఫ్ట్ చేస్తారని భావించారు. ఇప్పుడు గులాబ్ తుఫాన్ కూడా ఓ రకంగా ఇబ్బందికరంగానే మారిందని విశ్లేషణ.
పుష్ప చిత్రానికి తొలి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఆరంభం శేషాచలం అడవుల్లో లొకేషన్లు అనుకుంటే దానికి తిరుపతి వెంకన్న సామి బ్రేక్ వేశారు. అక్కడ అధికారులు అనుమతులివ్వలేదు. బ్యాంకాక్ థాయ్ లాండ్ లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లాలనుకుంటే అదీ వీలుపడకుండా కరోనా మహమ్మారీ రంగ ప్రవేశం చేసింది. కేరళ అడవులు అంటూ చాలానే అనుకున్నా ఏదీ కుదరలేదు. ఆ క్రమంలోనే మారేడుమిల్లి అడవుల్లో సుకుమార్ భారీ షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు. అరకు చింతపల్లి పరిసరాల్లోనూ షెడ్యూల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వర్షాల వల్ల షూటింగ్ కి బ్రేకులు తప్పడం లేదు.
పుష్ప -1 చిత్రీకరణ వేగంగా పూర్తి చేయాలనుకున్నా అది సాధ్యపడడం లేదు. కథాంశం పరంగా బన్ని ఈ చిత్రంలో పుష్పరాజ్ అనే గంధపు చక్కల స్మగ్లర్ కం డ్రైవర్ గా నటిస్తున్నారు. రష్మిక మందన కథానాయిక. మైత్రి సంస్థ నిర్మిస్తోంది. క్రిస్మస్ బరిలో ఇక రిలీజ్ లేనట్టేనని సమాచారం. సుకుమార్ తాజా షెడ్యూల్ ని అనుకున్నట్టు జరపాలంటే వాతావరణం అన్నివిధాలా అనుకూలించాల్సి ఉంటుంది.