Begin typing your search above and press return to search.
ఆర్ఆర్ఆర్ కోసం సంక్రాంతిని త్యాగం చేసేది ఎవరు?
By: Tupaki Desk | 3 Oct 2021 12:30 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ నెలలో సినిమా విడుదల చేయాల్సి ఉన్నా కూడా కరోనా పరిస్థితులు ఇంకా థియేటర్లు పూర్తి స్థాయిలో ఉత్తరాదిన ఓపెన్ కాకపోవడం వల్ల విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎట్టకేలకు విడుదల తేదీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జక్కన్న టీమ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2022 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి ఇప్పటికే సర్కారు వారి పాట.. రాధే శ్యామ్.. భీమ్లా నాయక్ మరియు ఎఫ్ 3 సినిమాలు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు మాత్రమే కాకుండా అఖండ సినిమాను కూడా సంక్రాంతి బరిలోనే దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఒక వేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా కనుక సంక్రాంతికి వస్తే ఉండే సినిమాలు ఎన్ని.. తప్పుకునే సినిమాలు ఎన్ని అనేది ఆసక్తికరంగా మారింది.
రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ ముగించుకుని సంక్రాంతికి విడుదల కు సిద్దంగా ఉన్నా కూడా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ వస్తుంది అంటే ఖచ్చితంగా సైడ్ ఇస్తారు. రాజమౌళి మరియు ప్రభాస్ ల మద్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి అడగక పోయినా కూడా ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ సంక్రాంతికి అనుకుంటున్నామంటే రాధే శ్యామ్ ను వాయిదా వేయడం పక్కా. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ను కూడా రాజమౌళి సినిమా కోసం వాయిదా వేసేందుకు ఓకే అంటున్నారట. మహేష్ బాబు వచ్చే ఏడాదిలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అందుకోసం ఇద్దరి మద్య రిలేషన్ బాగుండాలి. కనుక ఆర్ ఆర్ ఆర్ కోసం సర్కారు వారి పాట కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. గతంలో బాహుబలి కోసం మహేష్ బాబు తన సినిమాను కాస్త వాయిదా వేయడం జరిగింది. ఇక మిగిలి ఉన్న భీమ్లా నాయక్ మరియు ఎఫ్ 3 సినిమా లు కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ నిర్ణయించిన తర్వాత వారం లేదా మూడు నాలుగు రోజులు అటు ఇటుగా తేదీలు మార్చుకునే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ ను ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. మరింత ఆలస్యం చేస్తే పెట్టుబడికి వడ్డీ మరీ పెరిగి పోతుందని.. వచ్చే లాభం అలా వడ్డీలకే పోతుంది. అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కొమురం భీమ్ మరియు అల్లూరి సీతా రామ రాజు పాత్రల్లో కనిపించారు. రెండు యదార్థ పాత్రలను పూర్తిగా కల్పిత కథతో చూపించేలా ఈ సినిమాను దర్శకుడు జక్కన్న ప్లాన్ చేశాడు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకన్న బాహుబలి రికార్డు ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కేవలం రాజమౌళి అనే పేరును చూసి ఉత్తరాదిన సినిమాను చూసేందుకు లక్షల మంది క్యూ కట్టడం ఖాయం అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు ఉన్నారు. వారి ప్రజెన్స్ తో ఆర్ ఆర్ ఆర్ సినిమా స్థాయి మరింతగా పెరిగింది. కనుక ఖచ్చితంగా బాలీవుడ్ లో వందల కోట్లు ఈ సినిమా రాబోతుంది. సంక్రాంతికి విడుదల అయితే బాలీవుడ్ లో ఎక్కువ పోటీ లేదు. కనుక ఖచ్చితంగా ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలి.. అందుకోసం తమ తేదీని ఏ సినిమా వారు త్యాగం చేస్తారు అనేది ఈ నెల చివరి వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు న్నాయి.