Begin typing your search above and press return to search.

పెళ్లికి రెడీ అయిన త్రిష.. ఈసారి పక్కానట?

By:  Tupaki Desk   |   2 Sep 2021 4:32 AM GMT
పెళ్లికి రెడీ అయిన త్రిష.. ఈసారి పక్కానట?
X
చక్కనమ్మ పెళ్లి చేసుకున్నా అందమే.. చేసుకోకున్నా అందమే.. అందరి హీరోయిన్లలా డేటింగ్ ల వెంట పడకుండా తొందరగా ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటూ లైఫ్ లో ముందుకెళుతోంది త్రిష. ఆ మధ్య పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ తన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించడం లేదు.

అప్పుడెప్పుడు ప్రభాస్ తో వర్షం సినిమాతో పాపులర్ అయిన త్రిష అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్నేళ్లు అయినా పెళ్లి చేసుకోలేదు. సౌత్ ఇండియా ఫిలిం హిస్టరీలోనే సీనియర్ హీరోయిన్లలో త్రిష ఒకరుగా ఉన్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో హీరోయిన్ గా నటించింది. తమిళం, తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి రేంజ్ కు చేరుకుంది. 20 ఏళ్ల సుధీర్ఘ కెరీర్ త్రిష సొంతం. కెరీర్ తొలి 10 ఏళ్లలో తిరుగులేని హవాను సొంతం చేసుకుంది. ఇక కొన్నేళ్లుగా నామమాత్రంగానే కెరీర్ ను నడిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ కు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కొన్నేళ్ల కిందట వరుణ్ మణియన్ అనే నిర్మాతతో ఆమె నిశ్చిత్తార్థం కూడా చేసుకుంది. ఇక పెళ్లియే తరువాయి అని అంతా అనుకున్నారు. కానీ వీరి పెళ్లి అయితే జరగలేదు.

తాజాగా కోలీవుడ్ లో త్రిష పెళ్లి వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఒక వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి నిశ్చయం అయ్యిందని.. అందుకే త్రిష కొత్తగా సినిమాలేవీ అంగీకరించడం లేదని.. త్వరలోనే తన పెళ్లి గురించి త్రిష ప్రకటన చేయనుందని అంటున్నారు.

అందుకే ప్రస్తుతం త్రిష ఒప్పుకున్న సినిమాలన్నింటిని పూర్తి చేసి సినిమాలకు గుడ్ బై చెప్పే యోచనలో ఉందట.. ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’, బాలక్రిష్ణ మూవీలో నటిస్తోంది.