Begin typing your search above and press return to search.
రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఫోటోలకి పరిమితమైన హీరోయిన్..!
By: Tupaki Desk | 25 April 2023 5:00 AM GMTకన్నడ సెన్సేషనల్ మూవీ కె.జి.ఎఫ్ తో వెండితెరకు పరిచయమైంది శ్రీనిధి శెట్టి. మొదటి సినిమానే హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆ సినిమా సీక్వెల్ లో కూడా అమ్మడు భాగమైంది. కె.జి.ఎఫ్ 1, 2 సినిమాల హిట్లకు తను కూడా భాగమైంది.
అయితే అంత పెద్ద హిట్లు కొట్టిన శ్రీనిధి కెరీర్ లో ఆ దూకుడు చూపించట్లేదని చెప్పొచ్చు. కె.జి.ఎఫ్ 2 తర్వాత విక్రం తో కోబ్రా సినిమా చేసింది శ్రీనిధి కానీ ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో అమ్మడు సైలెంట్ అయ్యింది.
ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చినా తర్వాత సినిమాల విషయంలో కన్ ఫ్యూజ్ అవుతుంది శ్రీనిధి. అంతేకాదు తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకు రెమ్యునరేషన్ పరంగా కూడా ఎక్కువ అడిగి షాక్ ఇస్తుందట. శ్రీనిధి ఇదంతా తెలిసి చేస్తుందా లేక తెలియక చేస్తుందా అన్నది చెప్పడం కష్టం.
సినిమాలు చేయకుండా ఫోటో షూట్స్ తో కాలం వెళ్లదీస్తుంది అమ్మడు. కె.జి.ఎఫ్ లాంటి సినిమా చేసిన హీరోయిన్ వరుసగా ఐదారు సినిమాలతో బిజీగా ఉంటుందని అనుకుంటే ఇలా ఖాళీగా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంది.
కెరీర్ గైడెన్స్ లో ఆమెకు ఎవరు సపోర్ట్ గా నిలవట్లేదా ఏంటో కానీ శ్రీనిధి క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని తెలియట్లేదు. తెలుగులో ఒకటి రెండు సినిమాల డిస్కషన్స్ జరిగినా అమ్మడికి నచ్చలేదో లేక ఏమైందో కానీ ఆ అవకాశాలను మిస్ చేసుకుందట.
కోబ్రా తర్వాత శ్రీనిధి మరే సినిమాకు సైన్ చేయలేదు. అయితే ఆడియన్స్ కు మాత్రం తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. సినిమాలు చేయాలి కానీ ఇలా ఫోటో షూట్స్ ఎంత చేసినా ఏం లాభమని కొందరు అంటున్నారు.
జీరో సైజ్ పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ తో కుర్రాళ్ల హృదయాలను గాయం చేస్తున్న శ్రీనిధి వరుస సినిమాలు చేస్తే ఎంకరేజ్ చేసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. సినిమాల విషయంలో అమ్మడు సీరియస్ గా ఉంటే బెటర్ ఇలా సైలెంట్ గా ఉంటే ఫేడవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.