Begin typing your search above and press return to search.
పూరి 'జనగణమన' కు వింత కష్టం
By: Tupaki Desk | 7 March 2022 4:11 AM GMTడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటీ అంటే ప్రతి ఒక్కరు ఠక్కున చెప్పే పేరు జనగణమన. సుదీర్ఘ కాలంగా ఈ సినిమా ను చేసేందుకు పూరి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక అద్బుతమైన దేశ భక్తి ప్రథానమైన స్టోరీ లైన్ తో ఈ సినిమా కథ నడుస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ మద్య ఈ సినిమా ను మహేష్ తో చేస్తానంటూ పలు సందర్బాల్లో పూరి ప్రకటించిన విషయం తెల్సిందే.
ఒక సారి మహేష్ బాబు ఫోటోతో జనగణమన పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. కాని మహేష్ బాబు బిజీ షెడ్యూల్ మరియు ఇతర కారణాల వల్ల డేట్లు ఇవ్వలేక పోతున్నాడు. ముందు ముందు కూడా ఇస్తాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. దాంతో జనగణమన సినిమా ను మరో హీరోతో చేసేందుకు పూరి సిద్దం అయ్యాడు. ఆ మరో హీరో ఎవ్వరో కాదు లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో జనగణమన సినిమా ను పట్టాలెక్కించడం పక్కా అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. లైగర్ షూటింగ్ ను ముగించినట్లుగా ప్రకటించిన సమయంలోనే జనగణమన ను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా కు అనూహ్యంగా.. అనుకోని సమస్య ఒకటి వచ్చి పడింది. దాంతో అభిమానులు అయ్యో పాపం అంటున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే.. జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతో పూరి జగన్నాద్ పాన్ ఇండియా మూవీగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో తమిళంలో జనగణమన అనే టైటిల్ తో జయం రవి హీరోగా ఒక సినిమా రూపొందుతూ ఉంది.
మరో వైపు మలయాళంలో అదే టైటిల్ తో పృథ్వీ రాజ్ హీరోగా ఒక సినిమా పట్టాలెక్కేందుకు సిద్దం అవుతున్నాయి. ఈ రెండు సినిమాల వల్ల పూరి సినిమాకు ఇబ్బంది తప్పక పోవచ్చు అంటున్నారు.
పాన్ ఇండియా సినిమాలు అంటే తమిళ మరియు మలయాళ భాషల్లో కూడా విడుదల చేయాలి.. కాని అంతకు ముందు అదే టైటిల్ తో సినిమాలు వచ్చిన తర్వాత జనాలు మళ్లీ పూరి జనగణమన ను ఎవరు పట్టించుకుంటారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో పూరి ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది ప్రస్తుతం కు చర్చనీయాంశంగా మారింది. దేశ భక్తి నేపథ్యంలోనే ఈ మూడు జనగణమన సినిమాలు రూపొందుతున్నాయి.