Begin typing your search above and press return to search.

'ఎత్త‌ర జెండా' తో తెర‌పైకి కొత్త సందేహాలు?

By:  Tupaki Desk   |   15 March 2022 6:30 AM GMT
ఎత్త‌ర జెండా తో  తెర‌పైకి కొత్త సందేహాలు?
X
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ స‌మీపిస్తున్న వేళ యూనిట్ ప్ర‌చారం ప‌నుల్లో నిమ‌గ్న‌మైన సంగ‌తి తెలిసిందే. ఉన్న స‌మ‌యాన్ని తెలివిగా వినియోగించుకుని సినిమాకి వీలైనంత బ‌జ్ తీసుకురావాల‌ని యూనిట్ గ‌ట్ట‌లిగానే శ్ర‌మిస్తుంది. తాజాగా నిన్న‌టి రోజున `ఆర్ ఆర్ ఆర్` నుంచి `ఎత్త‌ర జెండా` అంటూ సాగే వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు.

ఇందులో ఎన్టీఆర్..రామ్ చర‌ణ్‌..అలియాభ‌ట్ ఆడిపాడారు. ప‌రాయి పాల‌న‌పై కాలుదువ్వి..కొమ్ములు విరిచిన కోడె గిత్తాల్లాంటి అమ‌ర‌వీరుల్ని త‌లుచుకుంటూ జ‌క్క‌న్న ఈ పాట‌ని రిలీజ్ చేసారు.

ప్ర‌స్తుతం ఈ పాట‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అయితే సినిమా రిలీజ్ కి ముందు ఇలా ఏకంగా వీడియోసాంగ్ ని రిలీజ్ చేయ‌డంతో ఎన్నో సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ పాట సినిమాలో ఉండ‌ద‌ని..కేవ‌లం ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ అని అంటున్నారు.

ఇంత‌కు ముందు `దోస్తీ` అనే పాట‌ని కూడా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ గానే రిలీజ్ చేసారు. ఆ పాట‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి `ఎత్త‌రా జెండా` సాంగ్ ని రిలీజ్ చేసి అభిమానులు అటెన్ష‌న్ డ్రా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఒకే సినిమాలో రెండు ప్ర‌మోష‌న‌ల్ సాంగ్స్ ఏంటి? అని సందేహం వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర స‌మాధానం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమా ప్రారంభించి మూడేళ్లు అవుతుంది. షూటింగ్ స‌హా క‌రోనా వంటి వైర‌స్ ల కార‌ణంగా అన్ని ప‌నులు డిలే అయ్యాయి. ప‌లు రిలీజ్ తేదీల్ని సైతం ప్ర‌క‌టించి వెన‌క్కి తీసుకోవ‌డం జ‌రిగింది. ఆ కార‌ణంగా సినిమా ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. సంక్రాంతి సంద‌ర్భంగా ఎట్టి ప‌రిస్థితుల్లో రిలీజ్ అవుతుంద‌ని భావించినా అనూహ్యంగా అప్పుడు వాయిదా త‌ప్ప‌లేదు.

దీంతో అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఇప్పట్లో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అవ్వ‌ద‌ని ఓ అంచ‌నాకి వ‌చ్చేసారు. ఈ గ్యాప్ స‌మ‌యంలోనే జ‌క‌న్న ఇలా ఎత్త‌రా జెండా సాంగ్ ని ప్ర‌మోష‌న్ గీతంలా చిత్రీక‌రించార‌ని...ఇప్పుడు వాటిని ప్ర‌చార గీతంలా వినియోగిస్తున్న‌ట్లు గుస గుస వినిపిస్తోంది. అయితే రెండ‌వ ప్ర‌మోష‌నల్ సాంగ్ ని తేవ‌డం వెనుక మ‌ళ్లీ సినిమా వాయిదా ప‌డుతుందా? అన్న సందేహం కొంద‌రిలో మొద‌లైంది. అందుకు ఓ ప్ర‌ధాన కార‌ణం తెర‌పైకి వ‌స్తోంది.

ప్ర‌స్తుతం మ‌ళ్లీ చైనా క‌రోనా కొత్తే వేరియేటంట్ తో లాక్ డౌన్ ప‌డుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికే లాక్ డౌన్ అమలులో ఉంది. స్టెల్త్‌ ఒమిక్రాన్ వేరియంట్ తో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. దీంతో వైర‌స్ వ్యాప్తి ఇత‌ర దేశాల‌కు పాకుతుంద‌ని విదేశాంగ రాయ‌బార వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి. ముందొస్తుగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. రాష్ర్ట ప్ర‌భుత్వాల‌కు కేంద్రం నుంచి నివేదికలు అందింతే ముందుగా మూత ప‌డేవి సినిమా థియేట‌ర్లే.

ఆ కార‌ణంగా `ఆర్ ఆర్ ఆర్` మ‌ళ్లీ వాయిదా ప్లాన్ ఉందా? అందుకే ఇప్పుడిలా వీడియో సాంగ్ ని రిలీజ్ చేసి అటెన్ష‌న్ డైవ‌ర్ట్ చేస్తున్నారా? అన్న రీజ‌న్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా క‌రోనా ట్రెండ్ కొన‌సాగుతుంది కాబ‌ట్టి ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితుల‌కు క‌నిపిస్తున్నాయి.