Begin typing your search above and press return to search.

యాంటిమ్ ట్రైల‌ర్‌: భాయ్ నుంచి ఎలాంటిది ఆశిస్తారో అలాంటిదే

By:  Tupaki Desk   |   26 Oct 2021 10:46 AM GMT
యాంటిమ్ ట్రైల‌ర్‌: భాయ్ నుంచి ఎలాంటిది ఆశిస్తారో అలాంటిదే
X
బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన తాజా చిత్రం `యాంటిమ్`. ఇందులో త‌న సోద‌రి అర్పిత భ‌ర్త ఆయుష్ శ‌ర్మ‌ విల‌న్ గా న‌టించడం మ‌రో కొస‌మెరుపు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బిగ్ ఫైట్ నేప‌థ్యంలో యాంటిమ్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుందని తొలి నుంచి చిత్ర‌బృందం చెబుతూనే ఉంది. ఇంత‌కుముందు రిలీజైన పోస్ట‌ర్ల‌లో స‌ల్మాన్ వ‌ర్సెస్ ఆయుష్ ఎపిసోడ్స్ ని ఎలివేట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

యాంటిమ్ నవంబర్ 26 న థియేట‌ర్ల‌లోకి విడుద‌ల‌వుతోంది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో సల్మాన్ అభిమానులను ఆకర్షించే అన్ని అవసరమైన అంశాలతో పక్కా కమర్షియల్ చిత్రమిద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇందులో భాయ్ చొక్కా విప్పి మాస్ మ‌సాలా యాక్ష‌న్ చిత్రాల‌తో రంజింప‌జేసేందుకు ఆస్కారం ఉంద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. స‌ల్మాన్ ఇందులో నిజాయితీ గల సిక్కు పోలీసు పాత్రను పోషించాడు ఆయుష్ వర్ధమాన డాన్ గా న‌టించారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వార్ ని ప‌రాకాష్ట‌లో ఆవిష్క‌రించారు ఈ సినిమాలో. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు గ్యాంగ్ స్టర్ మాఫియాతో వారికి ఉన్న లింక్ లతో ఈ చిత్రం ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. యాంటిమ్ అనేది 2018 మరాఠీ చిత్రం ముల్షి ప్యాటర్న్ కి అధికారిక రీమేక్. ట్రైలర్ లో సల్మాన్ వ‌ర్సెస్ ఆయుష్ మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. నిజానికి మాతృక‌లో స‌ల్మాన్ పాత్ర చిన్న‌దే కానీ.. ఇక్క‌డ ఏకంగా హీరోని చేస్తూ పాత్ర‌ను ఎన్ లార్జ్ చేసారు. యాంటిమ్‌లో ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి రానున్న ఈ చిత్రం ఏమేర‌కు రాణిస్తుందో చూడాలి. స‌ల్మాన్ న‌టించిన రాధే ఇంత‌కుముందు ఓటీటీలో థియేట‌ర్ల‌లో రిలీజై నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు యాంటిమ్ తో ఎట్టి ప‌రిస్థితిలో హిట్టు కొట్టాల‌నే పంతంతో ఉన్నాడు భాయ్. మహారాష్ట్రలో థియేటర్లు తిరిగి తెరవడంతో బాలీవుడ్ పెద్దలు తమ విడుదలకు సిద్ధమవుతుండ‌గా ఇప్పుడు భాయ్ కూడా ల‌క్ చెక్ చేసుకుంటున్నారు. అక్షయ్ కుమార్ సూర్యవంశీ నవంబర్ 5 న విడుదలవుతోంది. ఆ త‌ర్వాత యాంటిమ్ నుంచి ట్రీట్ ఉంటుంది.