Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' దుమారం అక్కడ లేనట్లే!

By:  Tupaki Desk   |   23 March 2022 6:32 AM GMT
భీమ్లా నాయక్ దుమారం అక్కడ లేనట్లే!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -టాలీవుడ్ హంక్ రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన `భీమ్లా నాయక్` ఇటీవల విడుదలై ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. పవన్ కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా నిలిచింది. `అత్తారింటికి దారేది` తర్వాత పవన్ కి దక్కిన సిసలైన సక్సెస్ ఇది. `అత్తారింటికి దారేది` పవన్ ని 100 కోట్ల క్లబ్ లో చేర్చితే `నాయక్` 200 కోట్ల క్లబ్ లో జాయిన్ చేసిన చిత్రంగా నిలిచింది. నాయక్ పవన్ ఇమేజ్ ని రెట్టింపు చేసిందని చెప్పొచ్చు.

వరుస పరాజయాల తర్వాత వచ్చిన గ్రేట్ వీక్టరీగా `భీమ్లా నాయక్` ని కీర్తించొచ్చు. ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని హిందీలో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని సన్నాహాలు చేసారు. `పుష్ప` దిరైజ్ సినిమా హిందీ బెల్ట్ లో అనూహ్య విజయాన్ని సాధించడం..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడంతో నాయక్ ని కూడా అక్కడ దించేయాలని ప్లాన్ చేసారు. కానీ రాజకీయంగా పవన్ కి ఉన్న అడ్డంకుల కారణంగా `భీమ్లానాయక్` ని ఏపీలో హఠాత్తుగా రిలీజ్ చేయాల్సి వచల్చింది.

దీంతో పాటు మళ్లీ కరోనా విజృంభిస్తే మొదటికే ముప్పు వస్తుందని భావించి హుటాహుటిన 25వ తేదీని తెలుగులో రిలీజ్ చేసారు. ఆ రకంగా` భీమ్లా నాయక్` హిందీ రిలీజ్ కి నోచుకోలేదు. అయితే ఆ తర్వాత అయినా హిందీలో రిలీజ్ చేసే అవకాశం ఉందని మీడియా కథనాలు వేడెక్కించాయి. కానీ ఇంతవరకూ ఆ దాఖలాలు ఎక్కడా కనిపించలేదు.

తాజాగా చిత్రం ఓటీటీలో కూడా ప్రసారానికి రెడీ అవుతుంది. దీన్నీ బట్టి `భీమ్లా నాయక్ ` ని హిందీలో రిలీజ్ చేయలేదని తేలిపోతుంది. ఓటీటీలో వివిధ భాషల్లో లైవ్ అవుతుంది కాబట్టి హిందీ వెర్షన్ రిలీజ్ కాదని చెప్పొచ్చు. `భీమ్లా నాయక్` మలయాళంలో విజయం సాధించిన `అయ్యప్పునం కోషియమ్` కి రీమేక్ గా సాగర్ కె. చంద్ర తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ వెనుకుండి సినిమాని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయనే సినిమాకి కథ..మాటలు అందించారు. ఈ సక్సెస్ తో యంగ్ మేకర్ సాగర్ .కె. చంద్రకి మంచి గుర్తింపు దక్కింది. అగ్ర హీరోల దృష్టిలో యంగ్ మేకర్ పడుతున్నాడు. ఇక పవన్ వేర్వేరు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో `హరి హరవీరమల్లు`.. హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవదీయుడు భగత్ సింగ్` చిత్రాల్లో నటిస్తున్నాడు.