Begin typing your search above and press return to search.
ట్రిపుల్ ఆర్ టీమ్ పరిచయం చేసిన 'అధీర'
By: Tupaki Desk | 23 March 2022 11:32 AM GMTయంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్టార్స్ తో కాకుండా సూపర్ హీరోస్ కథలతో సినిమాలు చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన టాలెంట్ కి స్టార్ లతో సినిమాలు చేసే అవకాశం వున్నా ప్రత్యేక కథలతో సూపర్ హీరోస్ ని సృష్టిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఇండియన్ ఫస్ట్ ఒరిజినల్ సూపర్ హీరో స్టోరీ అంటూ `హను మాన్` మూవీని యంగ్ హీరో తేజ సజ్జతో తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ తాజాగా మరో క్రేజీ సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్ కు శ్రీకారం చుట్టారు.
ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మరో సూపర్ హీరో మూవీ `అధీర`. ఈ చిత్రం ద్వారా ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. గత కొంత కాలంటగా తన తనయుడిని హీరోగా పరిచయం చేయాలని నిర్మాత దానయ్య పలువురు డైరెక్టర్ లని పరిశీలించారు. ఫైనల్ గా ప్రశాంత్ వర్మ చెప్పిన సూపర్ హీరో స్టోరీ నచ్చడంతో తన తనయుడు కల్యాణ్ బాధ్యతల్ని ప్రశాంత్ వర్మకు అప్పగించారు.
భారతీయ ఇతిహాసాల్లోన్ని ప్రధాన పాత్రలని స్ఫూర్తిగా తీసుకుంటూ సూపర్ హీరోస్ కథల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్ర టీజర్ ని దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ బుధవారం విడుదల చేశారు. చిన్నతనం నుంచి ఎలక్ట్రిక్ పవర్ ని కలిగి వుంటే ఓ సూపర్ మీరో కథగా ఈ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోతున్నారు. పెద్దయ్యాక కూడా ఆ పర్ తో అతను ఎలాంటి అద్భుతాలు సృష్టించాడు అనే ఆసక్తికరమైన కథ, కథనాలతో ఈ మూవీని తెరసైకి తీసుకురాబోతున్నారు.
హాలీవుడ్ మార్వెల్ హీరోస్ తరహాలో ఈ మూవీలో హీరో పాత్రని డిజైన్ చేసినట్టుగా టీజర్‌లోని సన్నివేశాల ద్వారా స్పష్టమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. టీజర్ లో తనపైకి వస్తున్న రౌడీలని మట్టికరిపించే క్రమంలో హీరో చేతుల్లో ఎలక్ట్రిక్ స్పార్క్ కనిపించడం...చిన్నతనంలో తనని దండించడానికి ఓ వ్యక్తి హంటర్‌ని విసిరితే దానికి స్పార్క్ రావడం.. చనిపోయిన వ్యక్తికి తన పవన్ ని ఉపయోగించి ప్రాణం పోయడం.. చేతుల్లో స్పార్క్ తో ఖడ్గాన్ని సృష్టించడం వంటి సినిమాటిక్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని బారీ స్థాయిలోనే తెరపైకి తీసుకురాబోతున్నారు.
టీజర్ బీజిఎమ్ అదిరింది. శ్రీమతి చైతన్య సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే స్క్రీప్ట్ విల్లే, కెమెరా దాశరథి శివేంద్ర, సంగీతం గౌరిహరి. హను -మాన్ పూర్తయిన తరువాత ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు.