Begin typing your search above and press return to search.

'భీమ్లా' ట్రైలర్లను మించిపోయేలా ఫ్యాన్ రీకట్ ట్రైలర్..!

By:  Tupaki Desk   |   24 Feb 2022 11:30 AM GMT
భీమ్లా ట్రైలర్లను మించిపోయేలా ఫ్యాన్ రీకట్ ట్రైలర్..!
X
పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే అభిమానుల చేసే హడావిడి అంతా ఇంతా కాదు. రేపు శుక్రవారం 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ నేపథ్యంలో అలాంటి సందడే కనిపిస్తోంది. గతేడాది 'వకీల్ సాబ్' తో కంబ్యాక్ ఇచ్చిన పవన్.. ఈసారి 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ తో పలకరించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.

కాకపోతే ఇటీవల విడుదలైన 'భీమ్లా నాయక్' థియేట్రికల్ ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదని సర్వత్రా విమర్శలు వచ్చాయి. థమన్ అందించిన బీజీఎమ్ బాగాలేదని.. సౌండ్ మిక్సింగ్ సరిగా లేదని.. త్రివిక్రమ్ కేర్ తీసుకోలేదని కామెంట్స్ చేసారు. దీనిపై అభిమానులు నిరాశను వ్యక్త పరుస్తూ చిత్ర బృందాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మరో ట్రైలర్ ను వదిలి మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు.

'భీమ్లా నాయక్' రిలీజ్ ట్రైలర్‌ లో అభిమానులను కావాల్సిన హీరోయిజం ఎలివేషన్ సీన్స్ - డైలాగ్స్ - ఫైట్స్ వంటి అన్ని అంశాలను జోడించి ట్రైలర్ కట్ చేసారు. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య మడమ తప్పని యుద్ధం అంటూ సినిమా నేపథ్యాన్ని.. ఇద్దరి మధ్య వైరాన్ని చూపించే ప్రయత్నం చేసారు.

అంతేకాదు థమన్ ఈసారి పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. మొదటి ట్రైలర్ తో పోలిస్తే ఈ ఇది ఫ్యాన్స్ ను మెప్పించింది.

అయితే ‘భీమ్లా నాయక్’ రెండు ట్రైలర్స్ ను మించిపోయే విధంగా ఓ అభిమాని కట్ చేసిన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి ట్రైలర్ నిరుత్సాహ పరచడంతో ఈ వర్షన్ ట్రైలర్ ను కట్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ లోని సీన్స్ తీసుకొని థమన్ బీజీఎమ్ కి మ్యాచ్ చేసిన ఫ్యాన్ రీకట్ వీడియో ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

కాగా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా భార్యగా సంయుక్త మీనన్ నటించారు.