Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' బాలీవుడ్లో అడుగుపెట్టంది అందుకేనట!

By:  Tupaki Desk   |   25 Feb 2022 6:00 AM GMT
భీమ్లా నాయక్ బాలీవుడ్లో అడుగుపెట్టంది అందుకేనట!
X
సాధారణంగా తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవాలి .. పాటలు పంచుకోవాలి. ఇక మిగతా కథ ఏదైనా వీటి మధ్యలోనే నడవాలి .. లేకపోతే ఆడియన్స్ బోర్ ఫీలవుతారు. అలాంటప్పుడు రొమాన్స్ ను పక్కన పెట్టేసి ఎమోషన్స్ ను మాత్రమే పట్టుకుని హీరోలు రంగంలోకి దిగితే అదో పెద్ద సాహసమే అవుతుంది.

అలాంటి ఒక సాహసంతో ఈ రోజున థియేటర్లలో దిగిన సినిమానే 'భీమ్లా నాయక్'. ఇది మలయాళంలో కొంతకాలం క్రితం విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి రీమేక్.

మలయాళ ప్రేక్షకుల టేస్టు వేరు .. వాళ్లు కథలోని సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కానీ అదే కథకి అదనపు ఆకర్షణలు లేకపోతే ఇక్కడి ప్రేక్షకులకు నచ్చదు. అందువల్లనే ఈ కథకి ఇక్కడ త్రివిక్రమ్ కాస్త రిపేర్లు చేయవలసి వచ్చింది. ఆయన స్క్రీన్ ప్లే చేసిన ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా .. రానా సరసన నాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. తమన్ అందించిన పాటలు ఈ సినిమాపై అంచనాలు పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి.

తెలుగుతో పాటు హిందీలోను ఈ సినిమాను ఈ రోజునే విడుదల చేయాలనుకున్నారు. అయితే అందుకు సంబంధించిన పనులు పూర్తికాకపోవడం వలన, ముందుగా అనుకున్నట్టుగా ఈ రోజున ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయలేకపోయారు. వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమాను అక్కడ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ లోగా అక్కడ కూడా కొత్త ట్రైలర్ ను వదులుతారట. పవన్ కల్యాణ్ హిందీ ప్రేక్షకులకు పరిచయమే. ఇక రానా ఆల్రెడీ అక్కడి సినిమాలు చేశాడు. అందువలన అక్కడ ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టొచ్చని అనుకుంటున్నారు.

ఇక తెలుగులో ఈ సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. థియేటర్ల దగ్గర సందడి ఒక రేంజ్ లో ఉంది. పవన్ - రానా పోటాపోటీగా చేశారని అంటున్నారు.

పవన్ ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ చేరిపోయినట్టేననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమా తరువాత పవన్ 'హరి హర వీరమల్లు' షూటింగులో జాయిన్ కానున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుగా 'భవదీయుడు భగత్ సింగ్' లైన్లో ఉండనే ఉంది.