Begin typing your search above and press return to search.
లాలా... భీమ్లా... రాజకీయ మంత్రం...తంత్రం...?
By: Tupaki Desk | 25 Feb 2022 10:30 AM GMTభీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయింది. హిట్ టాక్ ని కూడా సొంతం చేసుకుంది. అయితే పవన్ సినిమా నటుడు మాత్రమే కాదు, రాజకీయ నేత కూడా. దాంతో ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆయన కోసం స్నేహం కోసం ఎదురుచూస్తున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా భీమ్లా అంటూ ఇపుడు తెగ కలవరిస్తున్నారు. ఒక విధంగా ఏపీలో అయితే భీమ్లా నాయక్ రాజకీయ మంత్రంగా మారిపోయింది. మరో వైపు అధికార పార్టీకి ఇది రాజకీయ తంత్రంగా మారుతోంది అంటున్నారు.
భీమ్లా నాయక్ మూవీకి ఏపీలో టికెట్ ధరలు పెంచలేదు. అదనపు షోస్ కి అనుమతి ఇవ్వలేదు. దాంతో ఫ్యాన్స్ అయితే గుర్రుగా ఉన్నారు. వారు వైసీపీ సర్కార్ మీద మండిపోతున్నారు. వారి ఆవేశం సహజం, దానికి అర్ధం, పరమార్ధం ఉన్నాయి. కానీ వారితో పాటుగా రాజకీయ గొంతులు కూడా కోరస్ గా లేస్తున్నాయి.
భీమ్లా నాయక్ కి మద్దతుగా రంగంలోకి దిగిపోతున్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీలో అయితే టాప్ టూ బాటం అంతా కూడా జై భీమ్లా అంటున్నారు. భీమ్లా నాయక్ సినిమాకు ఇబ్బందులు సృష్టిస్తారా అంటూ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మీరు ఒక వ్యక్తి కోసం వ్యవస్థలను నాశనం చేస్తారా అని గుడ్లురిమారు. ఆయన తనయుడు లోకేష్ ఇదే తీరున సర్కార్ మీద విరుచుకుపడ్డారు.
ఇక అనతపురంలోని జేసీ ప్రభాకరరెడ్డి అయితే జగన్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ని ఏమీ చేయలేరు అంటూ సెటైర్లు వేశారు. ఇది కక్ష సాధింపు చర్య అన్నారు. భీమ్లా నాయక్ కి ఆల్ ఓవర్ గా హిట్ టాక్ తెచ్చుకున్నా ఏపీలో మాత్రం ఇబ్బందులుచాలానే ఉన్నాయి. తక్కువ రేట్లకు సినిమాను వేయలేమని థియేటర్లను కూడా మూసేసిన సీన్ ఉంది.
ఈ నేపధ్యంలో టీడీపీ భీమ్లా అంటూ రాజకీయ మంత్రమే పఠిస్తోంది. పవన్ మీదనా మీ టార్గెట్ అంటూ జగన్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తోంది. నిజంగా మిగిలిన పార్టీలు అయితే ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు. జనసేనకు మిత్రపక్షంగా బీజేపీ ఉంది. తమ మిత్రుడి సినిమాకు ఇబ్బంది వచ్చింది అని గతంలో అంటే వకీల్ సాబ్ టైం లో బీజేపీ నేతలు సునీల్ డియోధర్ వంటి వారు తిరుపతిలో హడావుడి చేశారు. ఇపుడు మాత్రం వారు నోరు మెదపడంలేదు.
ఇక వామపక్షాలు, మరికొన్ని పార్టీలు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంలేదు, కానీ టీడీపీ మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. దాన్ని చూసి జనసైనికులే ఆశ్చర్యపోతున్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే మా కంటే వీర లెవెల్ భక్తిగా ఉంది తమ్ముళ్లది అని అంటున్నారు.
ఇదంతా పవన్ కోసమే, పవన్ జపం చేస్తే ఆయన కరుణించకపోతాడా అన్నదే టీడీపీ ఆలోచన అని సెటైర్లు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటే కచ్చితంగా వైసీపీని టీడీపీ ఎదుర్కోగలదు, లేకపోతే ఒంటరి పోరులో ఇబ్బంది వస్తుంది. అందుకే పవన్ విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా అవుట్ రేట్ గా మద్దతు అంటోంది.
ఇక అధికార పార్టీ కూడా పవన్ని టార్గెట్ చేస్తోంది. అందులో రాజకీయ తంత్రం ఉంది. సినీ ప్రముఖులు అంతా టికెట్ల రేట్ల విషయంలో చర్చలు జరిపి వచ్చారు. పవన్ అయితే జనసేనానిగా మీటింగులు పెట్టి మరీ సర్కార్ జీవోలనే చించేస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. దాంతో సినీ ఇండస్ట్రీలో పవన్ని వేరుగా చూడాలని లెక్క ఏదో పెట్టుకున్నట్లుగా ఉంది.
అదే విధంగా పవన్ని రాజకీయంగా పెంచడానికి కూడా ఈ వ్యూహం ఉందని అంటున్నారు. పవన్ ఎంతగా పెరిగితే టీడీపీ అంతగా ఏపీలో తగ్గుతుంది అన్న ఎత్తుగడలు కూడా ఉన్నాయని అంటున్నారు. అపుడు పవన్ టీడీపీ రాయబేరాలకు లొంగరని, ఆ విధంగా జనసేనతో టీడీపీ బంధం కలవకుండా ఈ వ్యూహం అని అంటున్నారు. మొత్తానికి భీమ్లా నాయక్ సినిమా కాదు కానీ రాజకీయం మాత్రం ఏపీలో హీటెక్కిపోతోంది.