Begin typing your search above and press return to search.
హిందీ భీమ్లా నాయక్ గా వినిపించేది ఈయనే!
By: Tupaki Desk | 6 March 2022 12:30 AM GMTపవన్ కళ్యాణ్ మోస్ట్ క్రేజీ అండ్ భారీ చిత్రం భీమ్లా నాయక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డుల వర్షం కురిపిస్తూ వసూళ్లు నమోదు అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతి పెద్ద సక్సెస్ గా ఈ సినిమా నిలుస్తుందని మేకర్స్ మొదటి నుండి చెబుతూ వచ్చారు. అన్నట్లుగానే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను దక్కించుకుని ఇప్పటికే వంద కోట్లు క్రాస్ చేసి రెండవ వారంలో కూడా దూసుకు పోతుంది.
భీమ్లా నాయక్ ను తెలుగు లో విడుదల చేసిన సమయంలోనే హిందీలో కూడా విడుదల చేయాలని భావించారు. కాని కొన్ని కారణాల వల్ల హిందీ వర్షన్ ను విడుదల చేయడం లో ఆలస్యం అయ్యింది. దాంతో హిందీ వర్షన్ ఉండదేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. కాని హిందీ భీమ్లా నాయక్ రాబోతుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు మేకర్స్ తెలియజేస్తూ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.
అతి త్వరలోనే హిందీ భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్దం కాబోతుంది. ఈ సమయంలో ట్రైలర్ చూసిన తర్వాత పవన్ కళ్యాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరా అనే చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయేలా.. ఆయన పౌరుషం కు మరియు గాంభీర్యంకు తగ్గట్లుగా చక్కగా హిందీ భీమ్లా నాయక్ కు అతడు వాయిస్ సరిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా లో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి పేరు గౌరవ్ చోప్రా. ఈయన సీనియర్ టీవీ ఆర్టిస్టు. నటుడిగా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈయన పలు సక్సెస్ లను దక్కించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. ఎంతో మందిని పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ కు ఈయన వాయిస్ అయితే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చిన మేకర్స్ ఆయనతో వాయిస్ చెప్పించారు.
భీమ్లా నాయక్ లో చాలా పవర్ ఫుల్ మరియు ఎమోషనల్ డైలాగ్స్ ఉన్నాయి. పవన్ చెప్పిన ఆ డైలాగ్స్ కు థియేటర్లలో విజుల్స్ పడ్డాయి. కనుక రేంజ్ ఏమాత్రం తగ్గకూడదు అనే ఉద్దేశ్యంతో భీమ్లా నాయక్ సినిమాకు కూడా ఆయనతో డబ్బింగ్ చెప్పించారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ మరియు రానా ల మద్య పోరాటం ఒక అద్బుతమైన యుద్దం అన్నట్లుగా ఉందంటూ అభిమానులు కితాబిస్తున్నారు. పుష్ప సినిమా ఇటీవల హిందీ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా కూడా అక్కడ తప్పకుండా సక్సెస్ అవుతుందేమో చూడాలి.