Begin typing your search above and press return to search.

మలయాళ రీమేక్ లో మెగా తండ్రీకొడుకులు నటిస్తే..?

By:  Tupaki Desk   |   20 March 2022 12:30 PM GMT
మలయాళ రీమేక్ లో మెగా తండ్రీకొడుకులు నటిస్తే..?
X
'ఖైదీ నెం.150' అనే తమిళ రీమేక్ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. తన కెరీర్ లో పలు ఆసక్తికరమైన రీమేక్ సినిమాలు చేసిన చిరు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ మరో రెండు రీమేక్స్ తో రాబోతున్నారు.

చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''భోళా శంకర్'' తమిళ బ్లాక్ బస్టర్ 'వేదళమ్' కు అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే. అలానే మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ 'లూసిఫర్' తెలుగు రీమేక్ గా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది.

అయితే తాజాగా చిరు 'బ్రో డాడీ' అనే మరో మలయాళ రీమేక్ సెట్ చేస్తున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తే బాగుంటుందని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్ తో కలిసి నటించిన చిత్రం ‘బ్రో డాడీ’. ఇందులో మీనా - కల్యాణీ ప్రియదర్శన్ ఫీమేల్ లీడ్స్ లో కనిపించారు. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

దీంతో 'బ్రో డాడీ' చిత్రాన్ని తెలుగులో ఎవరితో రీమేక్ చేస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది. వెంకటేష్ - రానా.. వెంకీ - నాగచైతన్య అంటూ పలు కాంబినేషన్స్ వినిపించాయి. నిజజీవితంలో తండ్రీకొడుకులైన చిరంజీవి - రామ్ చరణ్ అయితే ఈ కథలో తండ్రీకొడుకులుగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రస్తుతం చిరంజీవి - చరణ్ ఇద్దరూ మాస్ యాక్షన్ చిత్రాల్లో నటిస్తున్న తరుణంలో.. 'బ్రో డాడీ' వంటి ఒక ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తే చూడాలని వారు కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో మెగా ఫాదర్ అండ్ సన్ ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి.

ఇకపోతే చిరంజీవి - రామ్ చరణ్ కలిసి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తొలిసారి తండ్రీకొడుకులు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న పూర్తి స్థాయి సినిమా కావడంతో 'ఆచార్య' పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు