Begin typing your search above and press return to search.
ధనుష్ ఇంటి బడ్జెట్ వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
By: Tupaki Desk | 23 Feb 2022 9:30 AM GMTలైఫ్ లో ప్రతీ ఒక్కరికీ సొంతింటి కల ప్రత్యేకంగా వుంటుంది. కలల సౌధాన్ని అత్యంత అందంగా .. తీర్చి దిద్దుకోవాలని, దాని కోసం ఎంతైనా ఖర్చు చేయాలని ఎదురుచూడని వారంటూ వుండరు. అలాంటి డ్రీమ్ హోమ్ కోసం కొంత మంది కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. ఇప్పుడు ఇదే ఆలోచనతో తమిళ హీరో తన డ్రీమ్ హోమ్ కోసం కోట్లు ఖర్చు చేస్తండటం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళం లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా వున్నారు హీరో ధనుష్.
ఇదే ఏడాది ధనుష్ `సార్` మూవీతో తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఒకే సారి తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. తమిళంలో ఈ చిత్రానికి `వాతి` అనే టైటిల్ పెట్టారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైన విసయం తెలిసిందే. ఇటీవలే తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నానంటూ ప్రకటించిన ధనుష్ వార్తల్లో నిలిచారు.
18 ఏళ్ల బంధానికి వీడ్కోలు చెబుతున్నట్టు ప్రకటించడంతో దక్షిణాది సెలబ్రిటీలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే మళ్లీ వీరిద్దరూ కలవబోతున్నారని, ఇరు కుటుంబాలకు చెందిన పలువురు పెద్ద మనుషులు వీరిని కలిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని, త్వరలోనే ధనుష్ - ఐశ్వర్య మళ్లీ కలుస్తారని చెన్నై వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై ఇంత వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇదిలా వుంటే హీరో ధనుష్ తన డ్రీమ్ హోమ్ కు శ్రీకారం చుట్టబోతున్నారని, ఇందు కోసం కళ్ల చెదిరే బడ్జెట్ ని కేటాయిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ధనుష్ తన డ్రీమ్ హోమ్ కోసం దాదాపు 300 కోట్లు ఖర్చు చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదే నిజమైతే దక్షిణాది క్రేజీ హీరోల్లో అత్యంత భారీ ఖర్చుతో ఇంటిని నిర్మించబోతున్న హీరోగా ధనుష్ సరికొత్త రికార్డుని నెలకొల్పడం ఖాయం అంటున్నారు. ధనుష్ తెలుగుతో `సార్` మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈమూవీకి గానూ ధనుష్ పారితోషికంగా 50 కోట్లు తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీతో పాటు ధనుష్ మరో రెండు చిత్రాలు చేస్తున్నారు. అంతే కాకుండా తెలుగులో శేఖర్ కమ్ముల తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీనికి కూడా 50 కోట్లు డిమాండ్ చేశారట. ఈ రెండు చిత్రాలు ఇదే ఏడాది విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటు తమిళంలో మరో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు గానూ ధనుష్ 150 కోట్లు తీసుకున్నారట. ఒక్కో చిత్రానికి ఈ రేంజ్ లో పారితోషికం తీసుకునే హీరో ఇంటి కోసం 300 కోట్లు ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది.