Begin typing your search above and press return to search.
డీజే టిట్లు ఎలా పుట్టాడో భలేగా చెప్పాడు!
By: Tupaki Desk | 11 Feb 2022 1:47 AM GMTనేటితరం హీరోల్లో చెప్పుకోదగ్గ ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. కానీ వారికి ఒక టైమ్ రావాలి. ఆ తర్వాత వెనుదిరిగి చూడాల్సిన పనే ఉండదు. ప్రస్తుతం యువనటుడు సిద్ధు జొన్నలగడ్డ టైమ్ వచ్చిందనే అంతటా టాక్ వినిపిస్తోంది. అతడు డీజే టిల్లుగా ఆడియెన్ కి చక్కని వినోదాన్ని అందించేందుకు వస్తున్నాడు. ఇందులో ఒక విలక్షణ హైదరాబాదీ వ్యక్తిగా అతడి ఆహార్యం ఆద్యంతం ఫన్ తో కట్టి పడేయనుందని టీజర్లు ట్రైలర్లు నిరూపించాయి. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ లు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్న రిపోర్ట్ కూడా అందింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తమకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొన్ని సూచనలు చేశారని తెలిపారు. తమ స్టైల్లో ప్రయత్నించమని సూచించారని కూడా వెల్లడించారు. స్వతహాగా రచయిత అయిన సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు మాటల్ని అద్భుతంగా రాసారు. ఈ సినిమా కథాంశానికి నిజఘటనలను స్ఫూర్తిగా తీసుకున్నారు. ``సినిమా విషయానికి వస్తే పరిణతి లేదా బ్యాలెన్సింగ్ నాకు కనీసం ఆసక్తికరం కాదు. వ్యక్తికి ఎటువంటి సమస్యలు లేకుంటే ప్రేక్షకులు ఆసక్తి చూపరు. అందుకే టిల్లు క్యారెక్టర్ ని లోపభూయిష్టంగా ప్రెజెంట్ చేశాను`` అన్నారు.
తనకు రాయడం కంటే నటనపైనే ఆసక్తి ఎక్కువని సిద్ధూ తెలిపాడు. నాకు నటనపై ఎక్కువ ఆసక్తి ఉంది. మరొకరి కోసం వ్రాయడానికి నాకు ఆసక్తి లేదు. నటన నా తొలి ప్రయారిటీ అని.. యాభై ఒకటి శాతం నటనకే ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. నిజానికి సిద్ధు నాలుగు సంవత్సరాల పాటు తబలా నేర్చుకున్నాడు. ఇది తన సినిమాల సంగీతానికి సహాయపడుతుందని తెలిపాడు.
డీజే టిల్లు పూర్తి వినోదాత్మక చిత్రం. ప్రతి సినిమాకు టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. ప్రతి సినిమా అందరూ చూస్తారని చెప్పలేం. టార్గెటెడ్ ఆడియన్స్ సినిమా చూస్తే హిట్ అవుతుంది. ఇతర కేటగిరీ ఆడియెన్ కూడా దీనిని చూస్తే అది అదనపు ప్రయోజనకరం. డీజే టిల్లు ప్రేక్షకులు యువత - మాస్.. ఫ్యామిలీ ఆడియన్స్ లో హాస్యం థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. సినిమా రన్ టైమ్ దాదాపు 2 గంటల 4 నిమిషాలు. మా వద్ద దాదాపు 1 గంట ఫుటేజ్ తొలగించినది ఉంది.
మేము బహుశా విడుదలైన తర్వాత తొలగించబడిన దృశ్యాల శ్రేణిని విడుదల చేస్తాము.. అని తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ .. అలాగే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో సినిమాల స్క్రిప్ట్ లను వినడం అవసరమైతే తన విలువైన సలహాలు సూచనలు ఇస్తారు మాయావి. తొలుత త్రివిక్రమ్ గారికి కథ చెప్పాం. తన అభిప్రాయాలను ఆలోచనలను తెలియజేశారు. మా స్టైల్ లో సినిమా తీయమని చెప్పారు`` అని అన్నారు. సొంత కథలు తన స్వంత అనుభవాలు సిద్ధు ఎదుర్కొన్న సంఘటనల నుండి డీజే టిట్లు పుట్టాడని తెలిపారు.ప్రారంభ దశల్లో కథలు రాయడానికి మన అనుభవాల నుండి ప్రతిదీ ఎంచుకోవాలని సిద్ధు నవతరం రచయితలకు సూచించారు.