Begin typing your search above and press return to search.

#వివాదం..గంగూభాయి టైటిల్ మార్చాల‌న్న సుప్రీం!

By:  Tupaki Desk   |   24 Feb 2022 4:30 AM GMT
#వివాదం..గంగూభాయి టైటిల్ మార్చాల‌న్న సుప్రీం!
X
ఈ ఫిబ్ర‌వ‌రి ముగింపులో వ‌రుస‌గా భారీ క్రేజీ చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. ఈ నెల 25న ప‌వ‌న్ - రానా న‌టించిన భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌వుతుండ‌గా ఒక రోజు ముందు త‌ళా అజిత్ న‌టించిన వ‌లీమై విడుద‌ల‌వుతోంది. అయితే భీమ్లా తో పోటీ ప‌డుతూ ఆలియా భ‌ట్ న‌టించిన గంగూభాయి క‌తియావాడీ హిందీ-తెలుగులో విడుల‌వుతోంది.

ఈ రిలీజ్ ల‌కు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయ‌తే విడుద‌ల‌కు ముందు సంజయ్ లీలా భ‌న్సాలీ దర్శకత్వం వహించిన గంగూభాయి న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై పలు కేసులు నమోదయ్యాయి.

తాజాగా సుప్రీం కోర్ట్ మూవీ టైటిల్ మార్చాలని సూచించింది. విడుదలకు సంబంధించి కోర్టులో పెండింగ్ లో ఉన్న పలు కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని భ‌న్సాలీ న్యాయవాది కోర్టుకు తెలియజేసార‌ని తెలిసింది. దీనిపై రేపు కోర్టు విచారణ చేపట్టనుంది.

ఇంత‌కుముందు అసలు గంగూబాయి దత్తపుత్రుడు బాబు రావ్ జీ షా ఈ చిత్రం తన తల్లికి పరువు నష్టం కలిగించేలా ఉందని ఆరోపించాడు. సినిమా విడుదలపై స్టే విధించేందుకు నిరాకరించిన బాంబే హైకోర్టు ఆదేశాలను కూడా ఆయన సవాలు చేశారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ఎమ్మెల్యే అమీన్ పటేల్- కామాటిపుర నివాసి శ్రద్ధా సర్వేలు ఇతర కోణాల్లో మూవీపై ఫిర్యాదులు చేశారు.

గంగూబాయి కతియావాడి హుస్సేన్ జైదీ పుస్తకం మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై ఆధారంగా రూపొందించిన‌ది. కామాటిపురా అనే పేరును ఉపయోగించడం స‌రికాద‌ని ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతాన్ని తప్పుగా సూచించార‌ని... గతంలో అనేక వ్యభిచార గృహాలు నిర్వహించే ప్రాంతంగా కామాటిపుర ఉన్నా కానీ చిత్రంలో పేరును మార్చాలి అని కోరారు. అమీన్ పటేల్ తన పిటిషన్ లో `కామాటిపురా` - `కతియావాడి` పదాలను ఉపయోగించడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని వాటిని తొలగించాలని కోరారు. ఇప్పుడు సుప్రీంకోర్ట్ విచార‌ణ‌తో టైటిల్ మార్పు అనివార్యంగా మార‌నుంద‌ని తెలిసింది.

ఇప్ప‌టికే ఈ మూవీకి సెన్సార్ పూర్త‌యింది. యుఏ స‌ర్టిఫికెట్ ద‌క్కింది. సీబీఎఫ్ సి నాలుగు ప్రధాన కట్ లను సిఫార్సు చేసిన తర్వాత యుఏ సర్టిఫికేట్ తో చిత్రానికి లైన్ క్లియర్ చేసింది. తాజా స‌మాచారం మేర‌కు 17 సెకన్ల నిడివి గల డైలాగ్ విజువల్స్ ని తొల‌గించార‌ని తెలిసింది.