Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ ఫిలింజ‌ర్న‌లిస్ట్ ట్రేడ్ గైడ్ల‌క్ష్మీ నారాయ‌ణ మృతి

By:  Tupaki Desk   |   19 March 2022 5:00 AM GMT
సీనియ‌ర్ ఫిలింజ‌ర్న‌లిస్ట్ ట్రేడ్ గైడ్ల‌క్ష్మీ నారాయ‌ణ మృతి
X
50 ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన టాలీవుడ్ లో ట్రేడ్ గైడ్ మ్యాగ‌జైన్ ప్ర‌స్థానం తెలిసిందే. ఇండ‌స్ట్రీ ఆద్యంతం సినిమా ట్రేడ్ కి సంబంధించిన నిరంత‌ర వార్త‌ల్ని ద‌శాబ్ధాల పాటు అందించింది ఈ మ్యాగ‌జైన్. ట్రేడ్ గైడ్ మ్యాగ‌జైన్ అధినేత‌.. సీనియ‌ర్ ఫిలింక్రిటిక్ గంజి ల‌క్ష్మీ నారాయ‌ణ నేటి(19 మార్చి 2022) ఉద‌యం మృతి చెందారు. ఈ సంద‌ర్భంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ సంతాపం తెలియ‌జేసింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు అసోసియేష‌న్ స‌భ్యులు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసారు.

50ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన‌ ఫిలింక్రిటిక్స్ కార్య‌ద‌ర్శి

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ .. అంద‌రినీ క‌లుపుకుని పోయే త‌త్వం.. సింప్లిసిటీలో మేటి అని నిరూపించిన ట్రేడ్ గైడ్ ల‌క్ష్మీ నారాయ‌ణ గారు.. వారి జీవ‌న‌గ‌మ‌నం ఆద్యంతం మ్యాగ‌జైన్ నిర్వాహ‌కుడిగా సినీరంగంతో కొన‌సాగారు. క‌ష్టం న‌ష్టం బేరీజు వేసుకోకుండా మ్యాగ‌జైన్ ని న‌డిపించారు. లాభం కోసం న‌డిపించేది మ్యాగ‌జైన్ కాద‌ని నిరూపించారు. ఇది ప్యాష‌న్ కి సంబంధించిన‌ది. విజువ‌ల్ మీడియా డామినేష‌న్ పెరిగిన రోజుల్లోనూ సినీ ట్రేడ్ మ్యాగ‌జైన్ ని నిర్వ‌హించి నేను సైతం అని నిరూపించారు.

మంచి మ‌నిషి మ‌న‌సున్న మనిషి యువ‌జ‌ర్న‌లిస్టుల‌ను వెన్ను త‌ట్టి ప్రోత్స‌హించిన మ‌నిషి లేక‌పోవ‌డం బాధాక‌రం... అంటూ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సురేష్ కొండేటి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రూ.25 వేల ఆర్థిక సాయాన్ని త‌క్ష‌ణం వారి కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

సినిమా మ్యాగ‌జైన్లు అంత‌రించిపోయిన ఈ రోజుల్లోనూ ఇప్ప‌టికీ తెలుగు సినీప‌రిశ్ర‌మ త‌ర‌పున ట్రేడ్ గైడ్ మ్యాగ‌జైన్ ర‌న్ అవుతోంది. మ‌ద్రాస్ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ కి షిఫ్ట‌య్యే క్ర‌మంలో ఎన్నో ట్రేడ్ వార్త‌ల‌ను స‌ద‌రు మ్యాగ‌జైన్ ప్ర‌చురించింది. తెలుగు సినిమా ఆద్యంతం మ్యాగ‌జైన్ ఉనికి క‌నిపించింది. ఇప్ప‌టి డిజిట‌ల్ యుగంలోనూ ట్రేడ్ గైడ్ సినీమ్యాగ‌జైన్ కి అండ‌గా నిలిచి త‌ర్వాత సార‌థిగా మారి ముందుకు న‌డిపించిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ట్రేడ్ గైడ్ ల‌క్ష్మీ నారాయ‌ణ ఆత్మకు శాంతి చేకూరాల‌ని అసోసియేష‌న్ ప్రార్థించింది