Begin typing your search above and press return to search.

సర్జరీలు చేయించకుని అందాలు పెంచుకున్నానన్న హీరోయిన్

By:  Tupaki Desk   |   22 March 2022 7:08 AM GMT
సర్జరీలు చేయించకుని అందాలు పెంచుకున్నానన్న హీరోయిన్
X
`అధ్యక్ష` అనే క‌న్న‌డ మూవీతో సినీ రంగ‌ప్ర‌వేశం చేసిన అందాల భామ హెబ్బా ప‌టేల్‌.. 2014లో వచ్చిన `అలా ఎలా ?` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలీక‌పోయినా.. ఆ త‌ర్వాత హెబ్బా ప‌టేల్ చేసిన `కుమారి 21ఎఫ్` సూప‌ర్ హిట్‌గా నిలిచింది. రాజ్ త‌రుణ్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ ప్రేమ క‌థా చిత్రంలో హెబ్బా బోల్డ్‌గా న‌టించి యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

ఆపై ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, ఏంజెల్, 24 కిస్సెస్ ఇలా వ‌రుస సినిమాలు చేసింది. కానీ, ఇవేమి ఆమెకు స్టార్ హోదాను అందించ‌లేక‌పోయాయి. కొత్త హీరోయిన్ల రాక, స‌రైన స‌క్సెస్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల‌ కెరీర్ పరంగా కాస్తా వెనకబ‌డిన హెబ్బా ప‌టేల్‌.. మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ఓదెల అనే గ్రామంలో జ‌రిగిన సంఘ‌ట‌నల‌ ఆధారంగా రూపొందుతోన్న‌ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’లో న‌టిస్తోంది. అలాగే రామ్ కార్తీక్ స‌ర‌స‌న `తెలిసినవాళ్ళు` అనే మూవీ చేస్తోంది. ఈ రెండు చిత్రాలు నటనకు ప్రాధాన్యత ఉండేవే కావడం విశేషం. ఇక త‌మిళంలో ఈ మూవీ చేసేందుకు కూడా సైన్ చేసింది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే హెబ్బా ప‌టేల్‌.. త‌ర‌చూ అదిరిపోయే ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌ను మిస్మ‌రైజ్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ భామ‌.. త‌న అభిమానుల‌తో స‌ర‌దాగా చిట్ చాట్ చేసింది. ఈ సంద‌ర్భంగా వారు అడిగిన అన్ని ప్ర‌శ్న‌త‌కు ఎంతో తెలివిగా స‌మాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ అభిమాని.. `మీ అందానికి రహస్యమేంటి..?` అని ప్ర‌శ్నించాడు.

అందుకు హెబ్బా ఇచ్చిన అన్స‌ర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ ఆమె ఏం చెప్పిందంటే.. `అది బిగ్ సీక్రెట్‌. రివిల్ చేయ‌కూడ‌ద‌ని అనుకున్నా కానీ చెప్పక తప్పడం లేదు. దేవుడు ఇచ్చింది కొంత అయితే.. డాక్టర్ల కృషి మరికొంత` అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. దీంతో హెబ్బా తన అందం కోసం ఏమైనా సర్జరీలు చేయించుకుందా అన్న చ‌ర్చ‌లు నెట్టింట మొద‌ల‌య్యాయి. కాగా, అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం సినీ తార‌ల‌కు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంద‌రో హీరో, హీరోయిన్లు అందాన్ని పెంచుకునేందుకు కోట్లు ఖ‌ర్చు పెట్టి విదేశాల్లో స‌ర్జ‌రీలు చేయించుకున్నారు.