Begin typing your search above and press return to search.
భార్యతో ఫోటోలో కోసం బాలీవుడ్ సింగర్ పడిన అవస్థలు అన్ని ఇన్ని కావుగా?
By: Tupaki Desk | 17 March 2022 11:30 PM GMTసోషల్ మీడియా పుణ్యమా అని అప్పటివరకు పెద్దగా ఫోకస్ కాని అంశాలు ప్రత్యేకంగా అండర్ లైన్ చేసి మరీ వైరల్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వారి దెబ్బకు అప్పటివరకు పెద్దగా ప్రచారంలోకి రాని సరికొత్త అంశాలు వస్తుంటాయి. తాజా ఇష్యూ కూడా ఆ కోవకు చెందిందే. అందమైన భార్య ఉండగానే సరికాదు.. ఆమెకు తగ్గట్లుగా లేకపోయినా భర్త పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావన్న మాటను చెబుతారు కానీ.. మగమహారాజులకు ఏం తక్కువన్న బిల్డప్ కొందరు ఇస్తుంటారు. మాటల్లో ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ.. కొన్ని లెక్కల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ పప్పులు ఉడకవన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
తాజాగా బాలీవుడ్ నటుడు కమ్ సింగర్ హిమేశ్ రష్మియా సంగతే చూడండి. ఆయనకున్న పాపులార్టీ.. క్రేజ్ తక్కువేం కాదు. కానీ.. ఆయన తన భార్యతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చే విషయంలో పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ విషయాన్ని తాజాగా వైరల్ అవుతున్న వీడియో చెప్పేస్తుంది. ఎందుకిలా? అంటే.. భార్య సోనియా కపూర్ కంటే హిమేశ్ రష్మియా ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణం.
తాజాగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ఈ ముచ్చటైన జంటను కెమేరాల్లో బంధించటానికి ఫోటో గ్రాఫర్లు ఎగబడ్డారు.
వారంత అభిమానంగా ఫోటోలు తీస్తుంటే.. ఎంచక్కా ఫోజులు ఇచ్చేయటం సెలబ్రిటీలకు అలవాటే. కానీ.. హిమేశ్ రష్మియా మాత్రం.. భార్యతో కలిసి ఫోటోలు దిగటానికి నానా అవస్థలు పడ్డారు. భార్య కంటే తానే కాస్తంత హైట్ అన్న భావన కలిగించేందుకు పడిన తపన అంతా ఇంతా కాదు.
కాలి వేళ్ల మీద నిలబడి మరీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం చూసినప్పుడు.. వామ్మో.. మరీ ఇంతలా ఇబ్బంది పడలా? అన్న భావన కలుగక మానదు. భార్య కంటే తాను పొట్టిగా ఉన్న విషయానికి హిమేశ్ రష్మియా అలా ఫీల్ కావటాన్ని తప్పు పడుతున్నారు. అలా పీల్ కావాల్సిన అవసరం లేదంటున్నారు. నిజమే.. భార్య కంటే భర్త వయసు ఎక్కువ ఉండాలి. ఎత్తు ఎక్కువ ఉండాలి లాంటి స్టీరియో టైప్ ఫీలింగ్స్ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదన్న భావన కలగక మానదు.