Begin typing your search above and press return to search.

అందుకే హీరోగా చేయడం మానేశాను: జగపతిబాబు

By:  Tupaki Desk   |   2 March 2022 3:08 AM GMT
అందుకే హీరోగా చేయడం మానేశాను: జగపతిబాబు
X
తమిళ .. మలయాళ .. తెలుగు భాషల్లో దుల్కర్ కి మంచి క్రేజ్ ఉంది. మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయనకి, తెలుగు .. తమిళ భాషల్లోనూ మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత చేరువవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'హే సినామిక' తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్ .. అదితీ రావు కథానాయికలుగా అలరించనున్నారు. పలు చిత్రాలకు డాన్స్ మాస్టర్ గా పనిచేసిన బృందా మాస్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జగపతిబాబు .. సురేశ్ బాబు .. నాగచైతన్య తదితరులు హాజరయ్యారు. జగపతిబాబు మాట్లాడుతూ .. "డాన్స్ లో నాకు గురు బృందా మాస్టర్. పాపం నా కోసం ఆమె చాలా కష్టపడింది.

నాకు తెలిసి బృందా మాస్టర్ కెరియర్లో నేను మోస్ట్ డిఫికల్ట్ హీరోనై ఉంటాను. అందుకే నేను హీరోగా చేయడం మానేశాను కూడా. చిన్నపిల్లలకు నడక నేర్పినట్టుగా ఆమె నాకు డాన్స్ నేర్పించింది. కళా మాస్టర్ దగ్గర బృంద అసిస్టెంట్ గా చేస్తున్నప్పుడే ఆమె టాలెంట్ గురించి అంతా చెప్పుకునేవారు. అప్పటి నుంచి ఆమె ఎంతమందితో కలిసి పనిచేసిందో లెక్కేలేదు.

బృంద అంటే ఇప్పటికీ హీరోలకు .. హీరోయిన్లకు .. దర్శక నిర్మాతలకు అందరికీ చాలా ఇష్టం. తాను డైరెక్షన్ చేసిన ఈ సినిమా ఈ నెల 3వ తేదీన విడుదలవుతోంది. అందుకు నేను ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. దుల్కర్ ను నేను చాలా రోజుల తరువాత కలుస్తున్నాను. ఒకసారి కేరళలో వాళ్ల ఫాదర్ మమ్ముట్టి సినిమా షూటింగులో ఉన్నాను. అప్పుడు ఒక కారు అక్కడి నుంచి దూసుకుపోయింది .. అందులో దుల్కర్ ఉన్నాడు. ఇప్పుడు అతని కెరియర్ కూడా అలాగే దూసుకుపోతోంది. తను చాలా ఇంటెలిజెంట్ హీరో.

'కురుప్' లాంటి ఒక కథను అర్థం చేసుకోవడమే చాలా కష్టమైన విషయం. కానీ ఆ సినిమాలో ఆయన అద్భుతంగా చేశాడు. అందుకే ఆయన చాలా ఇంటెలిజెంట్ అని చెబుతున్నాను. ఇక కాజల్ .. అతిథిరావులతో కలిసి గతంలో నేను చేశాను. ఇక ఇక్కడ ఉన్న చైతూ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు .. తను నిజంగా బంగారమే.

ఇక  సురేశ్ బాబు నాకు మంచి ఫ్రెండ్. ఇద్దరం కలిసి చేసిన వెధవ పనులు .. మంచి పనులు చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పకూడదు. బృందా మాస్టర్ కాల్ చేసిన నన్ను రమ్మని చెప్పినప్పుడు, నేను రావడం వలన ఒక్క టిక్కెట్టు కూడా తెగదు అన్నాను. మీ బ్లెస్సింగ్స్ కావాలని అంది. గురువుకి బ్లెస్సింగ్స్స్ ఇచ్చే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది" అంటూ నవ్వేశారు.