Begin typing your search above and press return to search.
మళ్లీ దుబాయ్ వరకే జాకీ..నేపాల్..ప్రాన్స్ కి నో!
By: Tupaki Desk | 29 May 2022 9:30 AM GMTబాలీవుడ్ నటి జాక్వెలిన్ పెర్నాండేజ్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణ ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. కేసులో ప్రధాన నిందుతుడుగా ఎన్న సుకేశ్ చంద్రతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా జాకీ కేసులో కీలకంగా మారింది. ఇప్పటికే రెండు ధపాల ఈడీ విచారణకు హాజరైంది. అధికారులు జాకీ నుంచి కీలక సమాచారం రాబట్టారు.
సుకేశ్ తో తనుకున్న రిలేష్ గురించి పూర్తి సమాచారం ఇచ్చింది. సుకేష్ నుంచి అందుకున్న బహుమతులు..నగదు లెక్కగట్టి ఏడు కోట్ల రూపాయల జాకీ ఆస్తుల్ని సైతం ఈడీ ఎటాచ్ చేసింది. విచారణ నేపథ్యంలో దేశం దాటి వెళ్లడానికి వీలు లేకుండా కోర్టు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో దుబాయ్ లో సల్మాన్ ఖాన్ నిర్వహించిన ఈవెంట్ కి హాజరవ్వాల్సిన వచ్చిన సందర్భంలో ప్రత్యేకంగా కోర్టు అనుమతులు తీసుకుని దుబాయ్ ప్లైట్ ఎక్కింది.
అంతకు ముందు ముంబై ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న హంగామా తెలిసిందే. లుకౌట్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లైట్ ఎక్కాలని ట్రై చేసింది. కానీ ఎయిర్ పోర్టు పోలీసులు అడ్డుకోవడంతో అప్పటికప్పుడు హుటాహుటినా అనుమతులు తెచ్చుకుని ప్లైట్ ఎక్కింది.
తాజాగా మరోసారి అదే పరిస్థితి వచ్చింది. మే 31 నుంచి జూన్ 6 వరకూ దుబాయ్ లో జరిగే ఐఫా అవార్డుల వేడుకులకు హాజరవ్వాల్సి ఉంది. దీంతో దుబాయ్ తో పాటు..నేపాల్..ప్రాన్స్ వెళ్లి వచ్చేందుకు 15 రోజులు అనుమతి ఢీల్లి కోర్టుని కోరింది. అయితే కోర్టు కేవలం దుబాయ్ వెళ్లడానికి మాత్రమే అనుమతిచ్చింది.
నేపాల్..ప్రాన్స్ దేశాలు వెళ్లడానికి వీలులేదని నిరాకరించింది. దీంతో జాకి కేవలం ఒక దేశానికి మాత్రమే అనుమతి దక్కినట్లు తెలుస్తుంది. గతంలో కూడా దుబాయ్ వరకే అనుమతిచ్చింది. అయితే అప్పుడు రెండు మూడు దేశాల ప్రపోజల్ జాకీ పెట్టలేదు. కానీ ఈసారి అనుమతి అడిగినా కోర్టు ఇవ్వలేదు. ఇది ఐఫా వేదిక కాబట్టి కోర్టు అనుమతులిచల్చింది.
దానికి సంబంధించిన బాధ్యతలు ఐపా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రాన్స్..నేపాల్ ట్రిప్ అనేది పూర్తిగా జాకీ వ్యక్తిగతం కాబట్టి అనుమతించలేదని తెలుస్తోంది. భారత్ బ్యాంక్ లకు పంగనామాలు పెట్టి మనీ లాండరింగ్ కేసులో దేశం దాటిన ఉద్దండులు కొందరున్నారు కాబట్టే ఇలాంటి పరిస్థితి దాపరించిందన్నది గ్రహించాల్సిన విషయం.