Begin typing your search above and press return to search.
లైగర్.. తస్సదియ్యా ఇదీ పాన్ ఇండియా లుక్ అంటే!
By: Tupaki Desk | 18 March 2022 4:32 AM GMTబ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో దుమ్ము లేపింది లైగర్ టీమ్. ఉన్నట్టుండి సడెన్ స్టార్మ్ లా విరుచుకపడ్డారు లైగర్ టీమ్ సభ్యులు. హీరో విజయ్ దేవరకొండ తన దర్శకుడు పూరి జగన్నాథ్ .. నిర్మాత ఛార్మితో కలిసి ఛమక్కులా మెరిసాడు. టోటల్ లైగర్ టీమ్ బ్లాక్ సూట్ లో డ్రెస్ కోడ్ మెయింటెయిన్ చేస్తూ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. పాన్ ఇండియా ఆడియెన్ కి పిచ్చెక్కించారనే చెప్పాలి. ఇక బబ్లీ ఛార్మింగ్ బ్యూటీతో పూరి సర్ స్టైలిష్ ఫోజులు మరోవైపు మతులు చెడగొట్టాయి. ఇక సర్ సర్ అంటూ విజయ్ వెంట పడుతూ ముంబై మీడియా చేసిన హంగామా మామూలుగా లేదు.
బ్లాక్ టక్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ అతడి లైగర్ టీమ్ అపూర్వ మెహతా బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. సౌత్ ఇండస్ట్రీలోని హాటెస్ట్ హంక్ లలో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఉత్తరాదిన మామూలుగా లేదు. సౌత్ లో అతడికి భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు లైగర్ తో పాన్-ఇండియా మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం అందరి కళ్ళు అతనిపైనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అభిమానులు అతనిని పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా వేచి ఉన్నారు.
తాజాగా వీడీ అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకకు వచ్చినప్పుడు తన టక్స్ లో చాలా అందంగా కనిపించాడు. ఈ వేడుకలో విజయ్ దేవరకొండతో పాటు లైగర్ కీలక వ్యక్తులు అక్కడ ఉన్నారు.
ఇక స్టైలిష్ సూట్ లో విజయ్ దేవరకొండ హృదయాల్ని దొంగిలించాడు. ఛార్మీ ముందు భాగంలో స్ప్లిట్ ఉన్న నల్లటి సీక్విన్డ్ దుస్తులను ధరించింది. పూరీ నల్లటి షర్ట్- బ్లాక్ బ్లేజర్ - బ్లాక్ టైతో.. బ్లాక్ ప్యాంటు లో అదరగొట్టాడు. విజయ్ తో పోటీపడుతూ స్టైలిష్ గా కనిపించాడు పూరి.
ధర్మ ప్రొడక్షన్స్ - పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అలాగే దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ లైగర్ చిత్రంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమాలో చిన్న పాత్రలో మాత్రమే కనిపించనున్నాడు. లైగర్ తో విజయ్ దేవరకొండ మొదటిసారిగా పాన్-ఇండియా మార్కెట్ లో నిరూపించాలని కసిగా ఉన్నాడు. ప్రభాస్- బన్ని- చరణ్ - ఎన్టీఆర్ తర్వాత అంతే వేవ్ తో అతడు వస్తున్నాడు. దక్షిణాది నుండి వచ్చిన అనేక సంప్రదాయేతర చలనచిత్రాలు గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గొప్ప ప్రభావాన్ని చూపాయి. ఇప్పుడు లైగర్ వంతు రానుంది. ఆగస్టులో ఈ చిత్రం విడుదలవుతుంది.