Begin typing your search above and press return to search.
బిగ్ షాకిచ్చిన మహేశ్.. త్రివిక్రమ్ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్!
By: Tupaki Desk | 22 March 2022 7:30 AM GMTటాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ స్టార్ హీరో అర్జున్ సర్జా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఈ చిత్రం వేసవి కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ అనంతరం మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతుండగా..తమన్ సంగీతం అందిస్తున్నాడు.
దాదాపు 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి తొలి వారంలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అవ్వగా.. ఏప్రిల్ ఆఖరి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి నాలుగైదు నెలల్లో కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్స్ వేశాడట. కానీ, తాజాగా మహేశ్ ఇచ్చిన బిగ్ షాక్‌తో ఆయన ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయట.
అసలేం జరిగిందంటే.. మార్చి నెల నుంచే ఎండలు పెరిగిపోయాయి. ఇక మే నాటికి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశాలు ఉండటంతో.. ఆ నెల మొత్తం షూటింగ్‌కు దూరంగా ఉండాలని మహేశ్ డిసైడ్ అయ్యాడట. ఏప్రిల్ రెండో వారానికి సర్కారు వారి పాట చిత్రీకరణ ఎలాగో పూర్తి అవుతుంది. ఈ వెంటనే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయకుండా బ్రేక్ తీసుకుని.. ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లేందుకు మహేశ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది. ఇదే నిజమైతే త్రివిక్రమ్ సినిమా మరింత అలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.