Begin typing your search above and press return to search.

ఆ విషయంలో మాట ఇచ్చేసిన కీరవాణి!

By:  Tupaki Desk   |   5 April 2022 4:19 AM GMT
ఆ విషయంలో మాట ఇచ్చేసిన కీరవాణి!
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లోనే ఈ సినిమా 750 కోట్లకుపైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఇంకా అదే దూకుడుతో ఈ సినిమా ముందుకు దూసుకుని వెళుతోంది. కథాకథనాలు .. చిత్రీకరణ .. పాత్రలను మలిచిన విధానం .. భారీ సెట్లు .. కాస్ట్యూమ్స్ .. కొరియోగ్రఫీ .. కాస్ట్యూమ్స్ .. సంగీతం ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూర్చారు.

ఈ సినిమాలోని ప్రతి పాట ఒక ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. 'నాటు నాటు' .. 'ఎత్తర జెండా' పాటలను, ఎన్టీఆర్ - చరణ్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని ఆయన కంపోజ్ చేశారేమోనని అనిపిస్తుంది. ఇక 'దోస్తీ' పాట ఒక రకమైన స్ఫూర్తిని కలిగిస్తే .. 'కొమరం భీముడో' సాంగ్ మనసులను భారం చేస్తుంది. అసలు 'కొమ్మా ఉయ్యాలో .. కోన ఉయ్యాలో' పాటతోనే ఈ సినిమా మొదలవుతుంది.

మల్లి అనే గోండు జాతి అమ్మాయి తెల్ల దొరసాని చేతిపై అందమైన డిజైన్ వేస్తుంది. తరచూ అలా డిజైన్ వేయించుకోవడం కోసం దొరసాని ఆ పాపను బలవంతంగా తీసుకుని వెళ్లిపోతుంది.

మల్లి అనే ఈ పాత్ర కోసమే కొమరం భీమ్ పోరాటం చేస్తాడు. తెల్లదొరసాని చేతిపై డిజైన్ వేస్తూ మల్లి పాడే ఈ పాట మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అరే .. పాట అప్పుడే అయిపోయిందా? పూర్తిగా ఉంటే బాగుండేదే అనిపిస్తుంది. ఈ పాటను ఎవరు పాడారా అనుకున్నారు. తెరపై మల్లి పాడే ఆ పాటను 'ప్రకృతి' అనే పాప ఆలపించిందని కీరవాణి చెప్పారు.

ఆ పాప చాలా టాలెంటెడ్ అనీ .. తనకి మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. "ఈ సారి నేను ఆలస్యం చేయను .. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను నెలలోపే రిలీజ్ చేస్తాను. అందులో మల్లి పాత్ర కోసం ప్రకృతి పాడిన పూర్తి పాట ఉంటుంది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందని చెప్పిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ఆయన ట్వీట్ట్ చేశారు.