Begin typing your search above and press return to search.

నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసింది నేనే..!

By:  Tupaki Desk   |   23 March 2022 7:44 AM GMT
నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసింది నేనే..!
X
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మెగా బ్రదర్‌ నాగబాబు.. ఏ విషయం మీదైనా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఏది మాట్లాడినా ఏ పోస్ట్ పెట్టినా కాస్త వెటకారం, కొద్దిగా హాస్యం జోడించడం నాగబాబుకు అలవాటు. ఈ క్రమంలో కొన్నిసార్లు వివాదాలను కూడా కొని తెచ్చుకున్నారు.

ఇవన్నీ పక్కన పెడుతే నాగబాబు చాలా రోజుల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లో ఫ్యాన్స్‌ తో చిట్‌ చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు.. నిహారిక ఆమె ఇన్స్టాగ్రామ్ ఎందుకు డిలీట్ చేసింది వంటి పలు ప్రశ్నలకు బదులిచ్చారు.

'నాగబాబు అంకుల్.. నిహారిక అక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏమైంది? క్ర్ రూమర్స్ మీద రెస్పాన్డ్ అవ్వండి ప్లీజ్' అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి మెగా బ్రదర్ స్పందిస్తూ.. 'నిజానికి నేనే కోడింగ్‌ నేర్చుకొని అకౌంట్‌ హ్యక్‌ చేసి అకౌంట్‌ డియాక్టివేట్‌ చేశాను. మళ్లీ డీకోడింగ్‌ నేర్చుకొని అకౌంట్‌ రీ యాక్టివ్‌ చేస్తాను' అంటూ ఫన్నీగా జవాబిచ్చారు.

కాగా, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే నిహారిక కొన్ని రోజుల క్రితం ఉన్నట్టుండి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ని డిలీట్‌ చేసింది. యూట్యూబర్ నిఖిల్ తో నిహారిక జిమ్ సెషన్ కు సంబంధించిన వీడియోపై ట్రోల్స్ రావడంతోనే ఆమె తన ఖాతాను డీయాక్టీవేట్ చేసిందని వార్తలు గుప్పుమన్నాయి.

ఈ క్రమంలో నిహారిక - చైతన్య జోడీ గురించి పలు ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. భార్యభర్తల మధ్య ఏదో జరిగిందని.. అందుకే నిహారిక అకౌంట్ డిలీట్ చేయాలనే నిర్ణయం తీసుకుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే చైతన్య ఇటీవల ఒకే ఒక్క ఫోటోతో రూమర్స్‌ కి చెక్‌ పెట్టాడు.

నిహారిక అకౌంట్ తొలగించడం పై ఇప్పుడు నాగబాబు ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే మెగా బ్రదర్స్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్‌ లో భాగంగా వైసీపీ ప్రభుత్వం మీద కౌంటర్లు వేశాడు. అలానే మంచు ఫ్యామిలీ మీద సెటైర్లు వేసేశాడు.