Begin typing your search above and press return to search.

#RRR : సినిమాలోనే కాదు ప్రమోషన్‌ లో కూడా ఎన్టీఆర్ విశ్వరూపం

By:  Tupaki Desk   |   23 March 2022 4:00 AM GMT
#RRR : సినిమాలోనే కాదు ప్రమోషన్‌ లో కూడా ఎన్టీఆర్ విశ్వరూపం
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ చాలా ఎనర్జిటిక్ గా మాట్లాడుతారు. సబ్జెక్ట్‌ ఏదైనా కూడా అనర్గలంగా మాట్లాడే సత్తా ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో ఎన్టీఆర్‌ ముందు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన్ను భవిష్యత్తులో చాలా ఉన్నత స్థితిలో చూస్తాం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్ని టాపిక్స్ లో ఎంత సీరియస్ గా మాట్లాడుతాడో.. అంతే ఫన్నీగా కొన్ని విషయాల్లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ఉంటాడు.

గత రెండు వారాలుగా ఎన్టీఆర్ ఫన్నీ సంభాషణలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఆయన ప్రతి యొక్క ఇంటర్వ్యూలో ఏదో ఒక విభిన్నమైన మ్యానరిజం ను ఇమిటేట్ చేయడంతో పాటు సరికొత్తగా తనను తాను ఫన్నీ వే లో చూపించేందుకు ఎన్టీఆర్‌ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్‌ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో పలు సినిమాలకు చెందిన ఫన్నీ డైలాగ్స్ ను మరియు బ్రహ్మానందం ఫన్ ఎక్స్‌ ప్రెషన్స్‌ ను కూడా ఇమిటేట్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

రాజమౌళి ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో ఎన్టీఆర్‌ నట విశ్వ రూపంను చూపిస్తాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్క సన్నివేశంలో.. ఆ విషయానికి వస్తే ప్రతి ఒక్క షాట్‌ లో కూడా ఎన్టీఆర్‌ యొక్క నట విశ్వరూపంను అద్బుతంగా చూపించేందుకు గాను రాజమౌళి సిద్ధంగా ఉన్నాడు. సినిమా లో ఎలాగూ సీరియస్ గా నట విశ్వ రూపం ను ఎన్టీఆర్ చూపిస్తాడని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే ఆయన విశ్వ రూపం చూస్తున్నామని అభిమానులు అంటున్నారు.

ఎన్టీఆర్‌ ముందస్తు విశ్వరూపం ఆయన ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ ఉంది. ఆయన ప్రతి విషయం పట్ల కలిగి ఉన్న అవగాహన.. మీమ్స్‌ మొదలుకుని వరల్డ్‌ వైడ్ టాపిక్స్ వరకు ప్రతి ఒక్క విషయంలో ఆయనకు అంతో ఇంతో.. ఎంతో అయితే అవగాహణ ఉంది. ఆ అవగాహణ తో సందర్బానుసారంగా ఇంటర్వ్యూ సమయంలో చమక్‌ లు విసరడం.. ఫన్నీగా అక్కడి పరిస్థితి మార్చడం అనేది కామన్‌ గా చేస్తూ వస్తున్నాడు. ఆయనలోని ఫన్ యాంగిల్‌ లో కొత్త లెవల్‌ ను చూస్తున్నామని.. ఆయన విశ్వరూపం ఇది అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్‌ సినిమా లో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇక రామ్‌ చరణ్‌ ను అల్లూరి సీతారామ రాజు పాత్రలో చూపించబోతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్ ఈ సినిమా లో హీరోయిన్ గా చరణ్‌ కి జోడీగా కనిపించబోతుంది. ఎన్టీఆర్‌ కు జోడీగా హీరోయిన్ ఉందా లేదా అనే విషయం లో క్లారిటీ లేదు. ఆ విషయమై ఎన్టీఆర్‌ స్పందిస్తూ నాకే ఆ విషయం పై క్లారిటీ లేదు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు.