Begin typing your search above and press return to search.
ఫైనల్ గా ఎ.ఎం. రత్నంకు గుడ్ న్యూస్ చెప్పిన పవన్
By: Tupaki Desk | 1 April 2022 3:30 AM GMTకరోనా కారణంగా చాలా వరకు పెద్ద చిత్రాల షూటింగ్ లు చాలా వరకు ఆగిపోయిన విషయం తెలిసిందే. కరోనా, ఒమిక్రాన్.. సెకండ్ వేవ్ ల కారణంగా మరి కొంత ఆలస్యం అయిన భారీ ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటిగా మళ్లీ సెట్స్ కు వెళుతున్నాయి. రిలీజ్ కు సిద్ధమైన చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఓ మూవీ మాత్రం గత 15 నెలలుగా ముందుకు కదలడం లేదు. దీంతో స్టార్ ప్రొడ్యూసర్‌గా ఓ దశలో భారీ క్రేజ్ ని సొంతం చేసుకుని వరుస క్రేజీ ప్రాజెక్ట్ లని అందించిన సదరు నిర్మాత తల పట్టుకున్నారట. ఆయనే స్టార్ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఖుషీ, బంగారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ఎ.ఎం. రత్నం ముచ్చటగా మూడవ సారి పవన్ తో చారిత్రక నేపథ్య కథతో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని ప్రారంభించారు. క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని 17 వ సెంచరీ కాలం లోని మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. పవన్ కిది తొలి పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో అభిమానులు కూడా ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
హైదరాబాద్ లో ని అల్యూమినియం ఫ్యాక్టరీలో కోవిడ్ కి ముందు భారీ సెట్ లని నిర్మించి షూటింగ్ ప్రారంభించారు. 15 రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఆ వెంటనే కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఆ తరువాత మళ్లీ ఇంత వరకు ముందుకు కదిలింది లేదు. పవన్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లేదు. గతంలో వేసిన సెట్స్ పనికిరాకుండా పోవడంతో పద్మశ్రీ తోట తరణి నేతృత్వంలో ఫ్రెష్ గా మళ్లీ సెట్స్ ని రూపొందించారు.
పవన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే సినిమాని రాకెట్ వేగంతో పూర్తి చేయాలన్నది క్రిష్ ఆలోచన. అయితే పవన్ మాత్రం మరో రీమేక్ పై కన్నేయడం, మధ్యలో `భీమ్లానాయక్` కోసం వెళ్లడం వంటి కారణాలతో ఈ మూవీ డిలే అవుతూ వస్తోంది. దాదాపు 15 నెలలుగా ఈ సినిమా షూటింగ్ ఎక్కడ ఆగిందో అక్కడే వుండటం.. పవన్ తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఆసక్తిని చూపించకపోవడంతో నిర్మాత మన స్థాపానికి లోనయ్యారనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా నిర్మాత ఎ.ఎం.రత్నంకు పవర్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆగిపోయిన ఈ మూవీ కోసం పవన్ ఐదు నెలలు కేటాయించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఈ మూవీ కోసమే పవన్ డేట్స్ కేటాయించారట. ఏప్రిల్ 6 నుంచి `హరి హర వీరమల్లు` కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఆగస్టు వరకు కంటిన్యూగా షూటింగ్ చేయబోతున్నారట. ఫైనల్ వర్క్ ని క్రిష్ సెప్టెంబర్ లో పూర్తి చేస్తారని, పవన్ ఒక్కసారిగా ఈ మూవీకి ఐదు నెలలు కేటాయించడం ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలని షాక్ కు గురిచేస్తోందని అంటున్నారు.