Begin typing your search above and press return to search.
ఒక్కో సినిమాకి పవన్ ఎంత తీసుకుంటున్నారు?
By: Tupaki Desk | 3 March 2022 4:30 PM GMTపవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మునుపెన్నడూ లేనంగా సినిమాల విషయంలో స్పీడు పెంచేశారు. జనసేన పార్టీ కార్యకలాపాల కారణంగా దాదాపు మూడున్నరేళ్ల పాటు సినిమాలకు దూరంగా వుంటూ వచ్చిన పవన్ కల్యాణ్ బలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన `వకీల్ సాబ్` రీమేక్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా పవర్ ఫుల్ స్టోరీతో రావడంతో ఆడియన్స్ పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ని అందించారు. ఇదే ఉత్సాహంతో మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తాజాగా `భీమ్లానాయక్`తో మరో సారి థియేటర్లలో సందడి చేశారు.
మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా రూపొందిన ఈ క్రేజీ మూవీ రిలీజ్ కి ముందు నుంచే భారీ హైప్ ని సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతూ హల్ చల్ చేస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ అంచిందిన సక్సెస్ జోష్ లో వున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా మరో రీమేక్ పై కన్నేశారు.
తమిళంలో సముద్రఖని, తంబి రామయ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం `వినోధాయ సితం`. సముద్రఖని కీలక పాత్రలో నటించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత ఏడాది థియేటర్లలో కాకుండా జీ5 ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. మంచి విజయాన్ని సాధించింది. టైమ్ అనే దేవ దూతగా సముద్రఖని నటించిన ఈ చిత్రం సరికొత్త కథ, కథనాలతో రూపొందింది. ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని పవర్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది.
త్వరలోనే ఈ మూవీని పవన్ తో రీమేక్ చేయబోతున్నారు. పవర్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ లతో కలిసి జీ స్టూడియోస్ నిర్మించబోతోంది. ఇప్పటికే సముద్రఖనితో కలిసి త్రివిక్రమ్ స్క్రీప్ట్ లో పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేయడం మొదలుపెట్టారట. అంతే కాకుండా త్రివిక్రమ్ డైలాగ్స్ ,స్క్రీన్ ప్లేని కూడా అందించబోతున్నారని తెలిసింది. సముద్రఖని డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలోని కీలక పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించబోతున్నారు.
త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ చిత్రాన్ని మొత్తం 40 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్ ని సిద్ధం చేశారట. అయితే పవర్ స్టార్ మాత్రం దీని కోసం కేవలం 20 రోజులు కేటాయించారట. ఇందు కు ఆయన 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీతో పాటు ప్యారెలల్ గా క్రిష్ డైరెక్ట్ చేస్తున్న `హరి హర వీరమల్లు` ప్రాజెక్ట్ ని కూడా పవన్ పూర్తి చేయబోతున్నారట. ఈ భారీ ప్రాజెక్ట్ ని ఈ ఏడాది పూర్తి చేసి రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.